Tollywood Stars: సాధారణంగా మాతృభాషలో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఇతర భాషలలో కూడా తమ సత్తా చాటుకోవాలని సినీ సెలబ్రిటీలు ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొందరు సెలబ్రిటీలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలలో నటించారు.అయితే కొందరికి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాకపోవడంతో తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కొందరు యంగ్ హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ హీరోలు వారి మొదటి సినిమాతోనే కోలుకోలేని దెబ్బ తిన్నారు. మరి ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే..
తెలుగు చిత్ర పరిశ్రమలో రౌడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మొదటిసారి లైగర్ అనే పాన్ ఇండియా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ ఎదుర్కొంది. అలాగే అక్కినేని వారసుడు యువసామ్రాట్ నాగచైతన్య అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఈ సినిమా కూడా తీవ్ర నిరాశపరిచింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో దెబ్బతిన్న టాలీవుడ్ హీరోలు..
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో జంజీర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. నితిన్ హీరోగా అగ్యాత్ పేరుతో ఒక సినిమా హిందీలో విడుదలయ్యి నిరాశపరిచింది. అలాగే హీరో రానా దమ్ మారో దమ్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా కూడా తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…