టాలీవుడ్‌లో మారుతి తెరకెక్కించిన ‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన తెలుగు హీరోయిన్ హాసిక ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారి పోయింది. వరంగల్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఆమధ్య వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ చిత్రంలో కూడా నటించింది.
ఈ రోజుల్లో, బస్‌స్టాప్, గ్రీన్ సిగ్నల్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన హాసికకు టాలీవుడ్ లో సరైన సినిమా ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్‌లో ఆనంది పేరుతో తనని తాను పరిచయం చేసుకుని మంచి ఛాన్స్ లనే రాబట్టింది. 2011లో తమిళంలోకి ఎంటర్ కావడం, హీరోయిన్ గా తను నటించిన మొదటి చిత్రమే సూపర్ హిట్ సాధించడంతో GV ప్రకాష్ సరసన కొన్ని సినిమాల్లో నటించిన ఆనంది ఆ తర్వాత రక్షిత పేరుతో కూడా మరిన్ని అద్భుత అవకాశాలను రాబట్టుకుని ముందుకు దూసుకు వెళ్తుంది.
కోలీవుడ్ లో అవార్డులు, రివార్డులను కూడా దక్కించుకున్న ఆనంది ‘చండీవీర్’ చిత్రంలో తన నటనా ప్రతిభతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి మార్కులు కొట్టేసింది. కోలీవుడ్ లో ఏడాదికి 4 సినిమాలకు పైగా నటిస్తున్న ఆనంది తెలుగులో మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందోనని టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…