Categories: FeaturedMovie News

ఒకప్పటి టాప్ యాంకర్ అనితా చౌదరి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

అనితా చౌదరి… ఒకప్పటి ప్రముఖ యాంకర్‌. బుల్లితెర పైనే కాక, తను నటించిన సినిమాల్లో కూడా యాంకర్‌ పాత్రనే చేస్తూ అటు బుల్లితెర ప్రేక్షకులకు, ఇటు వెండి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో హీరో తల్లి పాత్రతో మళ్ళీ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అనితా చౌదరి అంటే “సంతోషం” సినిమాలో నాగార్జున సిస్టర్ గా నటించింది ఆమె అన్నట్టుగా గుర్తురావొచ్చు కానీ తొంబైల్లో వాళ్లకి మాత్రం తను టాప్ యాంకర్, మోస్ట్ ఫేవరెట్ సీరియల్ స్టార్.

ఒకప్పుడు ఈ టివిలో ప్రసారం అయిన కస్తూరి సీరియల్ అప్పట్లోనే సంచలనం. వరుసగా 7 సంవత్సరాలు అనితా చౌదరికి ఉత్తమ నటి అవార్డుని కట్టపెట్టిందంటే మీరే అర్దం చేస్కోండి. సీరియల్స్ తో నటనా పరిశ్రమలో అడుగుపెట్టి, వెండితెరమీద వైవిధ్య మైన ప్రాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటీమణి అనితా చౌదరి. ఈటీవి, జెమిని, మాటివి ఇవేవి లేని కాలంలో అంటే కేవలం దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లోనే తను మంచి యాంకర్. సీరియల్స్, టెలిఫిల్మ్స్ చేస్తూ నటిగాను గుర్తింపు తెచ్చుకుంది.ఈ కాలం వాళ్లకి పరిచయం తక్కువే ఉన్నా “అమృతం” ఎంత పెద్ద హిట్టో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. “అమృతం” సీరియల్ లో హర్శవర్ధన్ కి జోడిగా సంజూ పాత్రలో అలరించింది అనితా. తన కెరీర్ తొలిరోజుల్లోనే బ్రహ్మనందంతో పాటుగా యాంకర్ కి చేసే అవకాశం దక్కించుకుంది.

నటుడు నరేశ్ తో కౌంట్ డౌన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు అనితా చౌదరి. “వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా… సాగే జీవనరాగం అణువణువున రుతురాగం” తొంభైల్లో ఈ సీరియల్, ఈ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు . రుతురాగాల్లో నటించిన అనిత ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా 30కి పైగా చిత్రాల్లో నటించింది. యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనితా చౌదరి ‘నువ్వే నువ్వే’, ‘సంతోషం’ లాంటి సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆనతి కాలంలోనే పెద్ద డ్యాన్సర్‌గా మారి పేరు తెచ్చుకోవాలనుకున్న ఆమె అనుకోకుండా కెమెరా ముందుకొచ్చింది. యాంకరింగ్‌, సీరియళ్లతో అడుగుపెట్టి వెండి తెరమీద వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తండ్రి కలకత్తాలో ఉద్యోగం చేస్తుండగా అక్కడే జన్మించింది అనిత. పెరిగింది, చదువుకొన్నదీ అంతా హైదరాబాద్‌లోనే.

ఇంట్లో చెప్పకుండా కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టారు. డాన్స్‌ స్కూల్లో బ్యాలేలూ, కథక్‌ నేర్చుకొన్నారు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, సమ్మర్‌ జాబ్‌లు చేస్తుండేదాన్ని. అప్పట్లో డీడీలో వచ్చే సీరియళ్లకు మంచి ఆదరణ. అలాంటి సమయంలో ఓసారి అశోక్‌రావుగారు డ్యాన్స్‌ స్కూల్లో అనితా చూసి టెలిఫిల్మ్‌లో నటించమని అడిగారు. అదే మొదటిసారి కెమెరా ముందుకు నటించడం. అయితే అది ప్రసారం కాలేదు. ఈటీవీలో యాంకర్ల కోసం ఆడిషన్లు జరుగుతున్నాయంటే తన ఫ్రెండ్స్‌ తనకి తెలియకుండా నా ఫొటో పంపించారు. నా నటనను పరీక్షించడం కోసం ‘సోది చెప్పడం వచ్చా.. చెప్పు చూద్దాం’ అన్నారు. ఏం చెప్పకపోవడంతో ‘సరే కెమెరా వంక చూసి నీపేరు, చదువు చెప్పేసి వెళ్లిపో’ అన్నారు. కొన్నిరోజులకు ఈటీవీ నుంచి బ్రహ్మానందం గారితో కలిసి ఓ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేయమని పిలుపువచ్చింది. అప్పటికి ఇంటర్‌ చదువుతున్నారు. ఆ కార్యక్రమం హిట్‌ అయింది. తరవాత నరేష్ గారితో కలిసి కౌంట్‌డౌన్‌ కార్యక్రమం. అదయ్యాక పబ్లిక్‌ డిమాండ్‌ అనే లైవ్‌ షో. ఈ కార్యక్రమాన్ని ఏడేళ్లపాటు చేశారు. అప్పటినుంచి అన్నీ వరుస అవకాశాలు వచ్చాయి.

తరవాత మంజులా నాయుడు దర్శకత్వంలో ఈటీవీలో అనితా చౌదరి చేసిన కస్తూరి డైలీ సీరియల్‌ పెద్ద సంచలనం. వరసగా ఆ సీరియల్‌కి 7 సంవత్సరాల పాటు ఉత్తమ నటి అవార్డుని అందుకొన్నారు. మొదట్లోనే ఈవిడకి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇ.వి.వి.సత్యనారాయణ ‘తాళి’ తీస్తున్న సమయం. శ్రీకాంత్‌ హీరో.. హీరోయిన్‌ పాత్రకోసం స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేశారు. కాని షూటింగ్‌ 6 నెలల పాటు రాజమండ్రిలో ఉంటుందని చెప్పడంతో చేయనన్నారు. హీరోయిన్‌ వేషం ఇస్తానంటే వద్దన్నదాన్ని నిన్నే చూస్తున్నా’ అంటూ ఆశ్చర్యపోయారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago