అనితా చౌదరి… ఒకప్పటి ప్రముఖ యాంకర్. బుల్లితెర పైనే కాక, తను నటించిన సినిమాల్లో కూడా యాంకర్ పాత్రనే చేస్తూ అటు బుల్లితెర ప్రేక్షకులకు, ఇటు వెండి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో హీరో తల్లి పాత్రతో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అనితా చౌదరి అంటే “సంతోషం” సినిమాలో నాగార్జున సిస్టర్ గా నటించింది ఆమె అన్నట్టుగా గుర్తురావొచ్చు కానీ తొంబైల్లో వాళ్లకి మాత్రం తను టాప్ యాంకర్, మోస్ట్ ఫేవరెట్ సీరియల్ స్టార్.

ఒకప్పుడు ఈ టివిలో ప్రసారం అయిన కస్తూరి సీరియల్ అప్పట్లోనే సంచలనం. వరుసగా 7 సంవత్సరాలు అనితా చౌదరికి ఉత్తమ నటి అవార్డుని కట్టపెట్టిందంటే మీరే అర్దం చేస్కోండి. సీరియల్స్ తో నటనా పరిశ్రమలో అడుగుపెట్టి, వెండితెరమీద వైవిధ్య మైన ప్రాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటీమణి అనితా చౌదరి. ఈటీవి, జెమిని, మాటివి ఇవేవి లేని కాలంలో అంటే కేవలం దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లోనే తను మంచి యాంకర్. సీరియల్స్, టెలిఫిల్మ్స్ చేస్తూ నటిగాను గుర్తింపు తెచ్చుకుంది.ఈ కాలం వాళ్లకి పరిచయం తక్కువే ఉన్నా “అమృతం” ఎంత పెద్ద హిట్టో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. “అమృతం” సీరియల్ లో హర్శవర్ధన్ కి జోడిగా సంజూ పాత్రలో అలరించింది అనితా. తన కెరీర్ తొలిరోజుల్లోనే బ్రహ్మనందంతో పాటుగా యాంకర్ కి చేసే అవకాశం దక్కించుకుంది.

నటుడు నరేశ్ తో కౌంట్ డౌన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు అనితా చౌదరి. “వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా… సాగే జీవనరాగం అణువణువున రుతురాగం” తొంభైల్లో ఈ సీరియల్, ఈ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు . రుతురాగాల్లో నటించిన అనిత ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా 30కి పైగా చిత్రాల్లో నటించింది. యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనితా చౌదరి ‘నువ్వే నువ్వే’, ‘సంతోషం’ లాంటి సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆనతి కాలంలోనే పెద్ద డ్యాన్సర్‌గా మారి పేరు తెచ్చుకోవాలనుకున్న ఆమె అనుకోకుండా కెమెరా ముందుకొచ్చింది. యాంకరింగ్, సీరియళ్లతో అడుగుపెట్టి వెండి తెరమీద వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తండ్రి కలకత్తాలో ఉద్యోగం చేస్తుండగా అక్కడే జన్మించింది అనిత. పెరిగింది, చదువుకొన్నదీ అంతా హైదరాబాద్‌లోనే.

ఇంట్లో చెప్పకుండా కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టారు. డాన్స్ స్కూల్లో బ్యాలేలూ, కథక్ నేర్చుకొన్నారు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, సమ్మర్ జాబ్‌లు చేస్తుండేదాన్ని. అప్పట్లో డీడీలో వచ్చే సీరియళ్లకు మంచి ఆదరణ. అలాంటి సమయంలో ఓసారి అశోక్‌రావుగారు డ్యాన్స్ స్కూల్లో అనితా చూసి టెలిఫిల్మ్‌లో నటించమని అడిగారు. అదే మొదటిసారి కెమెరా ముందుకు నటించడం. అయితే అది ప్రసారం కాలేదు. ఈటీవీలో యాంకర్ల కోసం ఆడిషన్లు జరుగుతున్నాయంటే తన ఫ్రెండ్స్ తనకి తెలియకుండా నా ఫొటో పంపించారు. నా నటనను పరీక్షించడం కోసం ‘సోది చెప్పడం వచ్చా.. చెప్పు చూద్దాం’ అన్నారు. ఏం చెప్పకపోవడంతో ‘సరే కెమెరా వంక చూసి నీపేరు, చదువు చెప్పేసి వెళ్లిపో’ అన్నారు. కొన్నిరోజులకు ఈటీవీ నుంచి బ్రహ్మానందం గారితో కలిసి ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేయమని పిలుపువచ్చింది. అప్పటికి ఇంటర్ చదువుతున్నారు. ఆ కార్యక్రమం హిట్ అయింది. తరవాత నరేష్ గారితో కలిసి కౌంట్‌డౌన్ కార్యక్రమం. అదయ్యాక పబ్లిక్ డిమాండ్ అనే లైవ్ షో. ఈ కార్యక్రమాన్ని ఏడేళ్లపాటు చేశారు. అప్పటినుంచి అన్నీ వరుస అవకాశాలు వచ్చాయి.
తరవాత మంజులా నాయుడు దర్శకత్వంలో ఈటీవీలో అనితా చౌదరి చేసిన కస్తూరి డైలీ సీరియల్ పెద్ద సంచలనం. వరసగా ఆ సీరియల్‌కి 7 సంవత్సరాల పాటు ఉత్తమ నటి అవార్డుని అందుకొన్నారు. మొదట్లోనే ఈవిడకి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇ.వి.వి.సత్యనారాయణ ‘తాళి’ తీస్తున్న సమయం. శ్రీకాంత్ హీరో.. హీరోయిన్ పాత్రకోసం స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. కాని షూటింగ్ 6 నెలల పాటు రాజమండ్రిలో ఉంటుందని చెప్పడంతో చేయనన్నారు. హీరోయిన్ వేషం ఇస్తానంటే వద్దన్నదాన్ని నిన్నే చూస్తున్నా’ అంటూ ఆశ్చర్యపోయారు.



























