టాలీవుడ్ ‘బస్టాప్’ లో కనిపించిన హాసిక ‘ఈరోజుల్లో’ ఏం చేస్తుందో తెలుసా.?

0
290

టాలీవుడ్‌లో మారుతి తెరకెక్కించిన ‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన తెలుగు హీరోయిన్ హాసిక ప్రస్తుతం కోలీవుడ్‌ లో బిజీ హీరోయిన్ గా మారి పోయింది. వరంగల్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఆమధ్య వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ చిత్రంలో కూడా నటించింది.

ఈ రోజుల్లో, బస్‌స్టాప్, గ్రీన్ సిగ్నల్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన హాసికకు టాలీవుడ్ లో సరైన సినిమా ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్‌లో ఆనంది పేరుతో తనని తాను పరిచయం చేసుకుని మంచి ఛాన్స్ లనే రాబట్టింది. 2011లో తమిళంలోకి ఎంటర్ కావడం, హీరోయిన్ గా తను నటించిన మొదటి చిత్రమే సూపర్ హిట్ సాధించడంతో GV ప్రకాష్ సరసన కొన్ని సినిమాల్లో నటించిన ఆనంది ఆ తర్వాత రక్షిత పేరుతో కూడా మరిన్ని అద్భుత అవకాశాలను రాబట్టుకుని ముందుకు దూసుకు వెళ్తుంది.

కోలీవుడ్ లో అవార్డులు, రివార్డులను కూడా దక్కించుకున్న ఆనంది ‘చండీవీర్’ చిత్రంలో తన నటనా ప్రతిభతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి మార్కులు కొట్టేసింది. కోలీవుడ్ లో ఏడాదికి 4 సినిమాలకు పైగా నటిస్తున్న ఆనంది తెలుగులో మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందోనని టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here