Featured

Meera Jasmine : ట్విస్టుల మీద ట్విస్టులతో మీరా జాస్మిన్ పెళ్లి… అసలు ఆరోజు ఏం జరిగింది..!

Meera Jasmine : మలయాళం సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టిన మళయాలి ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ ఆతరువాత తమిళ సినిమా ‘రన్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్ వంటి సినిమాలలో నటించిన మీరా జాస్మిన్ తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో సినిమాల్లో నటించిన మీరా 2014 లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి విషయంలో అనేక వివాదాలు జరిగాయి. చివరికి 2014 ఫిబ్రవరి లో అనిల్ అనే దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. అయితే మీరా జాస్మిన్ కి తన పెళ్లి జరిగిన రోజు మాత్రం ఒక పీడకలలాగా మిగిలిపోయింది.

అనుకున్న రోజు వివాహం చేసుకోని మీరా జాస్మిన్…

సినిమాల్లో మంచి సక్సెస్ చూసిన మీరా జాస్మిన్, కెరీర్ బాగా ఉన్నపుడే తల్లిదండ్రుల సలహాలు మేరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక మీరా జాస్మిన్ తల్లిదండ్రులు ఆమెకు వరుడిని వెతికే పనిలో ఉండగా 2013లో ఆమె పెళ్లి గురించి అనేక పూకార్లు వినిపించాయి. ఇక 2014 ఫిబ్రవరి 12 తిరుప‌నంతపురంలోని పలాయం ఎల్ఎంఎస్ చర్చ్ లో పెళ్లికి ఘనంగా ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే అనిల్ తో పెళ్ళికి సిద్ధమైన మీరా బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇక సెలబ్రిటీలు కొంతమంది కూడా ఆమె పెళ్ళికి హాజరయ్యారు. అయితే చర్చి లో పోలీసులు ఎక్కువమంది ఉండటంతో వచ్చిన వారందరూ సెలబ్రిటీలు, పెళ్ళికి హాజరువుతారని భద్రత ఏర్పాటు చేశారని అనుకున్నారట. కానీ నిజానికి అప్పటికే వరుడు అనిల్ కి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయి మీరా సంబంధం రావడంతో క్యాన్సిల్ అయిందట.

దీంతో ఆ పెళ్లికూతురు తరపు కుటుంబం నుండి అనిల్ బెదిరింపులు ఎదుర్కొన్నాడట అందువల్ల అంత బందోబస్తు నడుమ పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. ఇక చట్టభద్ధంగా పెళ్లి ఆరోజు రిజిస్ట్రేషన్ జరగలేదట. సరైన పత్రాలను అందించని కారణంగా వారి పెళ్లి ఆరోజున రిజిస్టర్ కాలేదు. మళ్ళీ రెండు నెలల తరువాత పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఈ లోపే మీరా భర్త అనిల్ మొదటి భార్యతో విడాకుల విషయంలో సరైన పత్రాలను సమర్పించని కారణంగా రిజిస్ట్రేషన్ కాలేదంటూ వార్తలు అల్లేశారు. అలా మీరా జాస్మిన్ పెళ్లి ఆమెకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago