Meera Jasmine : మలయాళం సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టిన మళయాలి ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ ఆతరువాత తమిళ సినిమా ‘రన్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్ వంటి సినిమాలలో నటించిన మీరా జాస్మిన్ తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో సినిమాల్లో నటించిన మీరా 2014 లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి విషయంలో అనేక వివాదాలు జరిగాయి. చివరికి 2014 ఫిబ్రవరి లో అనిల్ అనే దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. అయితే మీరా జాస్మిన్ కి తన పెళ్లి జరిగిన రోజు మాత్రం ఒక పీడకలలాగా మిగిలిపోయింది.

అనుకున్న రోజు వివాహం చేసుకోని మీరా జాస్మిన్…
సినిమాల్లో మంచి సక్సెస్ చూసిన మీరా జాస్మిన్, కెరీర్ బాగా ఉన్నపుడే తల్లిదండ్రుల సలహాలు మేరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక మీరా జాస్మిన్ తల్లిదండ్రులు ఆమెకు వరుడిని వెతికే పనిలో ఉండగా 2013లో ఆమె పెళ్లి గురించి అనేక పూకార్లు వినిపించాయి. ఇక 2014 ఫిబ్రవరి 12 తిరుపనంతపురంలోని పలాయం ఎల్ఎంఎస్ చర్చ్ లో పెళ్లికి ఘనంగా ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే అనిల్ తో పెళ్ళికి సిద్ధమైన మీరా బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇక సెలబ్రిటీలు కొంతమంది కూడా ఆమె పెళ్ళికి హాజరయ్యారు. అయితే చర్చి లో పోలీసులు ఎక్కువమంది ఉండటంతో వచ్చిన వారందరూ సెలబ్రిటీలు, పెళ్ళికి హాజరువుతారని భద్రత ఏర్పాటు చేశారని అనుకున్నారట. కానీ నిజానికి అప్పటికే వరుడు అనిల్ కి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయి మీరా సంబంధం రావడంతో క్యాన్సిల్ అయిందట.

దీంతో ఆ పెళ్లికూతురు తరపు కుటుంబం నుండి అనిల్ బెదిరింపులు ఎదుర్కొన్నాడట అందువల్ల అంత బందోబస్తు నడుమ పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. ఇక చట్టభద్ధంగా పెళ్లి ఆరోజు రిజిస్ట్రేషన్ జరగలేదట. సరైన పత్రాలను అందించని కారణంగా వారి పెళ్లి ఆరోజున రిజిస్టర్ కాలేదు. మళ్ళీ రెండు నెలల తరువాత పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఈ లోపే మీరా భర్త అనిల్ మొదటి భార్యతో విడాకుల విషయంలో సరైన పత్రాలను సమర్పించని కారణంగా రిజిస్ట్రేషన్ కాలేదంటూ వార్తలు అల్లేశారు. అలా మీరా జాస్మిన్ పెళ్లి ఆమెకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.


































