Featured

మొదటి వెడ్డింగ్ యానివర్సరీకీ స్పెయిన్ వెళ్లిన మెగా డాటర్… తనపై ఫిర్యాదు చేసిన భర్త!

మెగా కుటుంబంలో ఎన్నో అల్లరి పనులు చేస్తూ చిలిపిగా ముద్దుగా వుండే నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగా డాటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిహారిక వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అందుకు కారణం తన భర్తకు సినిమాలలో నటించడం ఇష్టం లేదని ఈమె హీరోయిన్ గా దూరమైనప్పటికీ నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు.

ఇక నిహారిక గత ఏడాది డిసెంబర్ 9 వ తేదీ జొన్నలగడ్డ వెంకట చైతన్యని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజులలో వీరి మొదటి పెళ్లి రోజు రావడంతో వీరిద్దరూ వారి పెళ్లి రోజున జరుపుకోవడానికి స్పెయిన్ వెళ్లారు. ఇక స్పెయిన్ లో ఈజంట బార్సిలోనాలోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ ఎన్నో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 

ఇక స్పెయిన్ లో వీరు గడిపిన ప్రతి ఒక్క మూమెంట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ స్కై డ్రైవింగ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నటువంటి వీడియోను షేర్ చేశారు. అలాగే డిన్నర్ కోసం ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు నిహారిక మాత్రం డిన్నర్ చేయకుండా ఫోన్ లో లీనమైపోయింది. ఈ క్రమంలోనే చైతన్య సెల్ఫీ ఫోటో దిగి ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఎప్పుడు ఇదే పనే ప్రతిక్షణం సెల్ ఫోన్ లో బిజీగా ఉంటుంది అంటూ నిహారిక గురించి ఫిర్యాదు చేశారు.ఈ ఫోటో షేర్ చేసిన మరికాసేపటికి నిహారిక ఫోన్ చూస్తూ ఉన్నటువంటి మరొక ఫోటోను షేర్ చేస్తూ కొన్ని మిలియన్ క్షణాల తర్వాత అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం వీరి స్పెయిన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు వీరికి ముందుగానే పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

7 minutes ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

44 minutes ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

3 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

4 hours ago

యంగ్ ఏజ్‌లోనే లివర్ రిస్క్.. ఫ్యాటీ లివర్‌కు ఆహారమే కారణమా? కొత్త అధ్యయనం ఏమంటోంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…

4 hours ago

రహానేకు డబుల్ షాక్.. ఓటమి + రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…

4 hours ago