Movie News

పిల్లల విషయంలో మెగా ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఉపాసన.. అసలేం జరగదంటే?

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈమె మెగా ఇంటి కోడలిగా కంటే తన సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది. ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ప్రజలకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయంతో ముందుకు వచ్చింది.

ఇక రామ్ చరణ్, ఉపాసన ఓ మీటింగ్ లో తొలిసారిగా పరిచయం పెంచుకోగా.. అలా వారి మధ్య ప్రేమ మొదలయిందని.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారని గతంలో తెలిపారు. ఇక ఈ ఏడాదికి తమ పెళ్ళి జరిగి 9 ఏళ్లు అవగా ఇప్పటికీ తమకు పిల్లలు పుట్టే లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా తమకు పిల్లల గురించి అభిమానుల నుండి మీడియా నుండి కూడా తెగ ప్రశ్నలు ఎదురవగా వాటి గురించి ఎన్నోసార్లు స్పందించారు. అయినా కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంతో ఉపాసన సోషల్ మీడియాలో కామెంట్ బాక్స్ ని కూడా బ్లాక్ చేసింది.

ఇక గతంలో తమ పిల్లల గురించి ఉపాసన స్పందించిన విషయం ప్రస్తుతం మళ్లీ నెట్టింట్లో వైరల్ గా మారింది. పిల్లల విషయంలో పూర్తిగా మా వ్యక్తిగత విషయం ఉంటుందని, మాకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మాకు పిల్లలు కలుగుతారని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా మాకేమైనా వయసు అయిపోయిందా అంటూ మండిపడింది. అయినా మా వ్యక్తిగత విషయాల గురించి మీరు మధ్యలోకి రావద్దని.. మా కెరీర్ లో మాకు కొన్ని గోల్స్ ఉన్నాయని.. అవన్నీ తీరిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తామని తెలిపింది.

అంతేకాకుండా తమ ఇంట్లో కూడా తమ కుటుంబ సభ్యులు తమ నిర్ణయం మీదనే ఉన్నారని.. దయచేసి మా వ్యక్తిగత జీవితంలోకి రాకుండా ఉండటం మంచిదని స్పందించింది ఉపాసన. ఇక మెగా అభిమానులు మాత్రం రామ్ చరణ్ వారసుడిని చూడాలని ఎంతో తాపత్రయ పడుతున్నారు. కానీ ఇప్పటంతలా అభిమానుల కోరిక తీరేలా లేదని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

4 minutes ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

24 minutes ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

2 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

2 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

3 hours ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

3 hours ago