‘మా’లో MAA(Movie Artists Associations) గొడవులు రోజురోజుకీ ముదురుతున్నాయే కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. చివరకు దీనిపై చిరంజీవి కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకు మెగాస్టార్(మా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు) లేఖ రాశారు. దీంతో కొందరిపై చర్యలు తీసుకోనున్నారు.
తాజాగా హేమ, నరేశ్ మధ్య జరిగిన వ్యవహారంలో మెగస్టార్ చిరంజీవి కల్పించుకున్నారు. వెంటనే ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరపాలని ఆయన లెటర్ కూడా రాశాడు. ప్రస్తుతం కమిటీ పదవి కాలం ముగిసిందని.. దీని వల్ల ఎన్నో సంక్షేమ పథకాల కార్యక్రమాలు నిలిచిపోయాయాని.. ఆయన లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని చిరంజీవి కోరారు.
‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పిన రోజు దగ్గర నుంచి రోజుకో వివాదం బయటకు వస్తుంది. ఎప్పుడు.. ఎక్కడ ఎవరిపై ఎలాంటి ఆరోపణలు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కోవిడ్ తర్వాత మా అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని.. వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని మెగస్టార్ సూచించారు.
ఇలానే ఎన్నికలు నిర్వహించకపోతే వివాదాలు ముదిరే అవకాశం ఉందని.. జాప్యం లేకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరాడు. లేకుంటే మా సంస్థకు చెడ్డపేరు వస్తుందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మెగస్టార్ ఈ విషయంలో కల్పించుకోవడంతో త్వరలోనే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…
ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…