CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?

CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?

CM Jagan-Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెట్ విధానం గురించి గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభ్యర్థనలు చేస్తోంది.

CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?
CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?

తాజాగా ఇండస్ట్రీ పెద్దలు రేపు 10వ తేదీని సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, రాధేశ్యాం, ట్రిపుల్ ఆర్ చిత్ర నిర్మాతలు సీఎంతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలు సమస్యలపై టాలీవుడ్ ప్రముఖులు చర్చించాలని అనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. 

CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?

తాజాగా సీఎంతో సమావేశం తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో థియేటర్ల టికెట్ ధరలపై ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాజాగా సినీ ప్రముఖుల సీఎంకు ఇచ్చే నివేదిక ఆధారంగా కమిటీ కూడా తన నివేదికకు తుది మెరుగులు దిద్దే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఇండస్ట్రీ సమస్యలపై గత నెల చిరంజీవి నేరుగా సీఎంతో సమావేశం అయ్యారు.

టికెట్ ధరలు, ప్రదర్శన నిబంధనల..

ఆ సయమంలో నాలుగైదు వారాల్లో గుడ్ న్యూస్ వస్తుందని కూడా చెప్పారు. ఘర్షణ వాతావరణం పెంచేలా ఎవరూ కూడా విమర్శలు చేయవద్దని ఇండస్ట్రీ వర్గానికి సూచించారు. ఇదిలా ఉంటే నిన్న ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, సీఎం జగన్ తో భేటీ అయ్యారు. టికెట్ ధరలు, ప్రదర్శన నిబంధనల గురించి వివరించారు. ఇదిలా ఉంటే మంత్రి ఇటు సామాన్యుడికి న్యాయం చేయడంతో పాటు ఇండస్ట్రీకి కూడా ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.