దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. అయితే చైనాతో గొడవల నేపథ్యంలో దేశంలోని చాలామంది దేశీ మొబైల్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాళ్లకు మైక్రోమాక్స్ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మైక్రోమాక్స్ ఇన్ 1బీ పేరుతో ఈరోజు సంస్థ మొబైల్ ఫోన్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
6.52 అంగుళాల హెచ్‌డీ + మినీ డ్రాప్ డిస్ ప్లే తో మైక్రోమాక్స్ సంస్థ మైక్రోమాక్స్ ఇన్ 1బి ఫోన్ ను లాంఛ్ చేసింది. . ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. 4 జీబీ మరియు 2 జీబీ ర్యామ్ లలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకుని ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. 4జీబీ ర్యామ్ కు మైక్రోమాక్స్ కంపెనీ 64 జీబీ సామర్థ్యంతో ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.
10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ఫోన్ బ్యాటర్ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్. మైక్రోమాస్క్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ ను మైక్రోమాక్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ లో ప్రైమరీ కెమెరా 13 మెగా పిక్సెల్ కాగా సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కొరకు ఫోన్ ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
2 జీబీ ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 రూపాయలు కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 7,999 రూపాయలు కావడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…