Featured

Mimicry Murthy : ఇండస్ట్రీలో విషాదం… జబర్దస్త్ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి కన్నుమూత..!

Mimicry Murthy : ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఏ క్షణాన ఎవ్వరి జీవితం ఏమవుతుందో ఊహించడానికి వీలు లేకుండా పోయింది. ఇండస్ట్రీ ఈమధ్య చాలా మంది నటులను కోల్పోయింది. తాజాగా తెలుగు తెలివిజన్ పరిశ్రమలో విషాదం నెలకొంది. మిమిక్రీ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన మూర్తి చనిపోయారు. దీంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్యాంక్రియాస్‌ క్యాన్సర్‌ కారణంగా తీవ్ర అనారోగ్యంతో మృతి…

జబర్దస్త్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన కమెడియన్ మూర్తి మంగళవారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా ధ్రువీకరించారు. జబర్దస్త్ అభిమానులకు మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎన్నో స్కిట్ల ద్వారా అభిమానులను అలరించారు. కొన్నేళ్లుగా ‘ప్యాంక్రియాస్‌’ క్యాన్సర్‌ అనే వ్యాధితో బాధపడుతున్న మూర్తి ఈ రోజు హన్మకొండలో మరణించారు.

క్యాన్సర్ కారణంగా రోజు రోజుకీ ఆరోగ్యం క్షీణించడం, రోజువారీగా వాడే మెడిసన్ కూడా సైడ్ ఎఫెక్ట్ చూపించడం మూర్తి మరణానికి కారణం అయ్యింది. ఈ మూడు సంవత్సరాలలోనే దాదాపు తన వైద్యం కోసం 16 లక్షలు ఖర్చు పెట్టారని కూడా సమాచారం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాణాలు నిలుపుకోలేక పోయారు. ఈయన మరణ వార్త తెలుసుకొని ఇండస్ట్రీలోని పలువురు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago