Megastar Chiranjeevi - CM Jagan: జగన్ చిరంజీవి భేటీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి నాని.. కుశలప్రశ్నలే అంటూ కామెంట్స్!
Megastar Chiranjeevi – CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనవరి 13వ తేదీ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అపాయింట్మెంట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విమానం ద్వారా విజయవాడ తాడేపల్లి సీఎం నివాసంలో ఆయనను కలిసి సినిమా సమస్యల గురించి వివరించానని ఈ భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో తెలిపారు.
ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ సినిమా సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రికి వివరించామని, ఈ సమస్యలన్నింటికీ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని చిరంజీవి తెలిపారు.
అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పై మరొక సారి పునరాలోచన చేయాలని చిరంజీవి జగన్ గారికి విజ్ఞప్తి చేసినట్లు మీడియా సమావేశంలో చిరంజీవి తెలిపారు.త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ క్రమంలోనే మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చిరంజీవితో ముఖ్యమంత్రి జరిపినది సంప్రదింపు చర్యలు కాదు కుశలప్రశ్నలే అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. వీరిద్దరూ భేటీ అయిన రోజు నేను లేనని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ చిరంజీవిని భోజనానికి ఆహ్వానించారు… ఆయన వెళ్లారు. భోజనం చేసే సమయంలో 100 మాట్లాడుకుని ఉంటారు. అయితే సినిమా టికెట్ల వ్యవహారం గురించి మాట్లాడితే సచివాలయంలో మాట్లాడుతారు కానీ.. ఇంట్లో ఎందుకు మాట్లాడతారు అంటూ నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. భోజనం చేసే సమయంలో అనధికారికంగా ఎన్నో మాటలు మాట్లాడుతారు. వాటి గురించి మాట్లాడటం అనవసరం అంటూ మీడియా సమావేశంలో తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…