కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసింది. కేంద్రం భారీ సంఖ్యలో రేషన్ కార్డులను రద్దు చేయడానికి ముఖ్యమైన కారణమే ఉంది. అర్హత లేకపోయినా కొందరు రేషన్ పొందుతుండటంతో కేంద్రం వారి కార్డులను రద్దు చేసింది. కేంద్రం రద్దు చేసిన కార్డులన్నీ బోగస్ కార్డులే కావడం గమనర్హం.
కొంద్ అర్హత లేకపోయినా అక్రమంగా రేషన్ పొందుతున్న నేపథ్యంలో కేంద్రం రేషన్ కార్డు కలిగిన కొందరికి షాక్ ఇచ్చింది. కేంద్రం రద్దు చేసిన రేషన్ కార్డులను కలిగి ఉన్నవాళ్లు ఇకపై రేషన్ ను పొందడం సాధ్యం కాదు. దేశంలోని ప్రజలకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు కూడా ఒకటి ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉంటారో వాళ్లు తక్కువ ధరకే రేషన్ ను పొందవచ్చు. అయితే రద్దైన రేషన్ కార్డులు కలిగి ఉన్నవాళ్లు ఇకపై తక్కువ ధరకే రేషన్ ను పొందలేరు.
కేంద్రం గత కొన్నిసంవత్సరాల నుంచి అక్రమంగా రేషన్ పొందుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రేషన్ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుల రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చనిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నవారు, అర్హత లేనివారు కేంద్రం నిర్ణయం వల్ల ఇకపై రేషన్ ను పొందలేరు.
మరోవైపు కేంద్రం చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకోవాలని చెబుతోంది. అయితే రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకోని వాళ్ల కార్డులను కూడా కేంద్రం రద్దు చేసిందని సమాచారం. కేంద్రం ఒకవైపు రేషన్ కార్డులను తొలగిస్తున్నా మరోవైపు అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుందని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…