ప్రశాంత్ కిషోర్ ని దెబ్బ కొట్టడం లో మోడీ విజయం సాదించాడా…ఇక పీకే జైలుకు వెళ్ళలిసిందేనా??

ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ vs పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్…. అవును మీరు వింటున్నది నిజమే… పీఎం మోడీ ఎలాంటి ప్రకటన చేసినా రాజకీయపరంగా పాలనాపరంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించిన దానిని చీల్చి చెండాడే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అదే దేశ వ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా ఎంతో పేరు ఉన్న ప్రశాంత్ కిషోర్ మాత్రమే. ప్రతి పక్షాల కన్నా కూడా ముందే ప్రశాంత్ కిషోర్ మోడీ నిర్ణయాలపై లోటుపాట్లతో నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతే కాదు దేశ వ్యాప్తంగా ప్రతి పక్షాల తరపున రంగంలోకి దిగి వారికీ విజయాన్ని చేకూరుస్తున్నాడు. ఒక్కో రాష్ట్రం పీకే గెలుస్తూ సవాలు విసురుతూ ఉంటె మోడీ, షా ద్వయం ప్రతి కార చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో భాగంగా మొదట జేడీయూ నుండి పీకేని బయటకు పంపడంలో ఒక అడుగు ముందుకేశారు. జేడీయూ నుండి సాగనంపగా పీకే అక్కడ నుండి పశ్చిమ బెంగాల్ లో తన పాగా వేసి ఇప్పుడు ఆమెను గెలిపించే పనిలో పడ్డారు. మమతా బెనర్జీతో కలిసి బీజేపీ ప్రభుత్వం గుక్క తిప్పుకోకుండా విమర్శలు చేస్తూ మోడీకి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.

కానీ మోడీ షా ద్వయానికి ఇప్పుడు పీకే పూర్తిగా దొరికినట్టే కనిపిస్తుంది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేసి అరవింద్ కేజ్రీవాల్ కి పట్టం కట్టించిన పీకే లాక్ డౌన్ సమయంలో నిబంధలు అతిక్రమించినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే లాక్ డౌన్ సమయంలో విమానాల్లో ప్రయాణం చేయడం పూర్తిగా నిషేధం అని అందరికి తెలిసిందే. ఇటీవల ఢిల్లీ నుండి మూడు కార్గో విమానాల్లో దేశంలో చాలా ప్రదేశాలకి కొంత సామాగ్రిని తరలించారు. ఈ విమానాలలో ఒక దాంట్లో పీకే ఎవరికీ తెలియకుండా ప్రయాణం చేశారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ప్రశాంత్ అలా ప్రయాణించినట్టయితే చట్ట రీత్యా అది నేరమే. ఈ వార్తలను బలపరచడానికి బీజేపీ సైతం తన అస్రాలను ప్రయోగిస్తోంది. ఢిల్లీ నుండి మమతా పిలుపు మేరకే పీకే కార్గో విమానములో ప్రయాణించి పశ్చిమ బెంగాల్ చేరుకున్నారని ఇలాంటి లాక్ డౌన్ సమయంలో ఎలాంటి రోడ్ ప్రయాణం చేయకుండా పీకే మమతా ని ఎలా చేరుకున్నారని ప్రశ్నిస్తుంది.

అంతే కాదు దీనిపై దర్యాప్తునకు కూడా మోడీ ప్రభుత్వం ఆదేశించడం తో విమానయాన సంస్థ వివరాలు సేకరిస్తుంది. ఢిల్లీ మరియు కోల్ కతా విమానాశ్రయాల్లో గల సీసీటీసీ ఫ్యూటేజ్ లు తెప్పించుకొని డేటా పరిశీలిస్తుంది. ఈ సమయంలో పీకే గాని ప్రయాణం చేసినట్టు రుజువు అయితే తృణమూల్ కి రాజకీయ వ్యూహాలు వేయకుండా అడ్డుకోవడంలో బీజేపీ సక్సెస్ అయినట్టే. అంతే కాదు ఈ కేసు వల్ల పీకే ఊచలు లెక్కపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది కదా అస్సలు రాజకీయం అంటే..!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రోజూ పప్పు తింటే గుండె జబ్బులు దూరం అవుతాయా?

నేటి జీవనశైలిలో గుండె జబ్బులు, క్యాన్సర్‌, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

3 minutes ago

ఎద్దు బాధపై రష్మి ఆగ్రహం.. కఠిన చర్యల డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత అంశంపై జరిగిన నిరసన కార్యక్రమం ఇప్పుడు అనూహ్యంగా జంతు హింస వివాదానికి దారితీసింది. తిరుపతిలో వైసీపీ…

5 minutes ago

ఆధార్‌లో కులం చూసి హీరో ఛాన్స్ క్యాన్సిల్.. షాకింగ్ రివీల్

టాలీవుడ్‌లో అవకాశాల కోసం పోరాడుతున్న కొత్త నటుల కథల్లో కొన్నిసార్లు చేదు నిజాలు బయటపడుతుంటాయి. అలాంటి అనుభవాన్నే తాజాగా నటుడు…

8 minutes ago

కృష్ణ తిడతారనుకున్నా.. మెచ్చుకున్నారంటే షాక్! ఎం.ఎస్. నారాయణ

తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేకమైన కామెడీతో చిరస్థాయిగా గుర్తుండిపోయిన నటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు…

11 minutes ago

రాత్రి తలుపులు తీయమన్న స్టార్.. జయలలిత షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌లో గ్లామర్ వెనుక దాగి ఉన్న కఠిన వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చేలా నటి జయలలిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

14 minutes ago

భోజనం తర్వాత ఈ అలవాట్లు మీ జీర్ణక్రియను దెబ్బతీస్తాయి!

ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం సరిపోదు. ఆహారం తీసుకున్న తర్వాత పాటించే అలవాట్లు కూడా శరీరంపై పెద్ద…

2 hours ago