సినిమా ఇండస్ట్రీలో కథానాయకుడిగా, విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది దేవుడిచ్చిన ఫలితమేనని ఎన్నోమార్లు మోహన్ బాబు తెలియజేశారు. ప్రస్తుతం మోహన్ బాబు “సన్నాఫ్ ఇండియా” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోహన్ బాబు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి నేను వచ్చాను. మా నాన్న వృత్తిపరంగా టీచర్ కావడంతో అందరినీ ఎంతో క్రమశిక్షణగా పెంచారు. ఇప్పుడు అదే క్రమశిక్షణ మా కుటుంబంలో పాటిస్తాము. ఏడు గంటలకు షూటింగ్ అంటే ఆరున్నరకే లోకేషన్ లో ఉంటాము. మనం గెలిచినప్పుడు ప్రశంసించే వారు మనం ఓడిపోయినప్పుడు విమర్శించే వారు కూడా ఉంటారు.
సినిమాలు పరంగానే కాకుండా రాజకీయాలలో కూడా ఎన్నో పార్టీల కోసం పని చేశాను. అయితే వారి నుంచి ఏది ఆశించి మాత్రం పని చేయలేదు. ఒకప్పుడు అన్నగారి కోసం టిడిపి పార్టీ లోకి వెళ్లాను. ఆ తరువాత బీజేపీకి వచ్చాను. ఇప్పుడు కూడా జగన్ సీఎం కావాలని ఆ పార్టీ లోకి వెళ్లాను అని తెలియజేశారు. ఇకపై ఈ రాజకీయ జీవితానికి నా జీవితంలో స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు నన్ను రాజకీయంగా గాయపరిచింది చంద్రబాబేనని ఈ సందర్భంగా మోహన్ బాబు తెలిపారు.
హెరిటేజ్ ఫుడ్స్ నాదే.. అప్పట్లో హెరిటేజ్ సంస్థలో నా షేర్ ఎక్కువ ఉండేది.. చంద్రబాబుది తక్కువ. ఒకరోజు రాజశేఖర రెడ్డిగారు నన్ను అడిగారు చంద్రబాబు, నువ్వు స్నేహితులే కదా మీ ఇద్దరికీ ఏంటి గొడవ ? అని అడిగారు. హెరిటేజ్‌లో నా డబ్బుని.. చంద్రబాబు ఎలా మోసం చేశాడో చెప్పా. ఆతను వాళ్ల మామకే వెన్నుపోటు పొడిచాడు.. నిన్ను మోసం చేయడంలో కొత్తేముంది అని వైయస్ అన్నారు.
తల్లిదండ్రులు చనిపోతే తన శవాన్ని ఇంట్లో ఉంచుకోము వారికి సంబంధించిన వస్తువులను కూడా పడేస్తాము కానీ వారు సంపాదించిన ఆస్తి మాత్రం ఇతరులకు ఇవ్వము దేవుడి కోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకుంటాము. కానీ మన తల్లిదండ్రులకు మాత్రం ప్రత్యేక గది ఎందుకు ఉండదు పిల్లలని సింహాసనంపై కూర్చోబెట్టి తల్లిదండ్రులను నేలపాలు చేస్తామంటూ తల్లిదండ్రుల గొప్పతనాన్ని వివరించారు. అలాగే ప్రతి ఇంట్లో కూతురు ఒక న్యాయం కొడుకుకు న్యాయం ఉంటుంది.ఇవన్నీ కూడా సన్నాఫ్ ఇండియా సినిమాలో అద్భుతంగా చూపిస్తున్నామని ఈ సందర్భంగా నటుడు మోహన్ బాబు తెలియజేశారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…