Movie News

Mohan Babu: మనోజ్ పెళ్లి విమర్శలపై ఘాటుగా స్పందించిన మోహన్ బాబు… వారంతా కుక్కలంటూ కామెంట్స్!

Mohan Babu: మంచు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో మనోజ్ ఒకరు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన ఈయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే తాజాగా ఈయన వాట్ ది ఫిష్ అనే సినిమాని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే మనోజ్ మార్చి మూడవ తేదీ అతి కొద్ది మంది బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని అందుకే ఈ పెళ్లి బాధ్యత మంచు లక్ష్మి తీసుకుందంటూ వార్తలు వినిపించాయి. ఇక ఈ పెళ్లికి మోహన్ బాబు కూడా హాజరుకారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమని మోహన్ బాబు దంపతులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇకపోతే మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన మనోజ్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ మనోజ్ మౌనిక గురించి తనకు ముందే చెప్పారని,తన నిర్ణయం విన్న తర్వాత ఒకసారి ఆలోచించుకో అని చెప్పాను. అప్పుడు నాన్న నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని భావిస్తున్నానని చెప్పగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పానని తెలిపారు.


Mohan Babu: కుక్కలు మొరుగుతుంటాయి…

ఇక ఈ పెళ్లి గురించి చాలామంది విమర్శలు చేశారు. ఆ విమర్శలపై మోహన్ బాబు స్పందిస్తూ ఏనుగు తన దారిన తాను వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మనం ఎన్ని కుక్కలని ఆపగలం.మొరిగే కుక్కలను మొరగనివ్వు అంటూ పెళ్లి గురించి విమర్శలు చేసిన వారందరినీ కుక్కలతో పోలుస్తూ ఈయన ఘాటుగా స్పందించారు. ఇలా మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago