అందరికీ మోహన్ బాబుగా తెలుసు కానీ తనకు మాత్రం భక్తవత్సలా నాయుడుగా సుపరిచితుడు అని ప్రముఖ దర్శకుడు సాగర్ తెలిపారు. నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని ఆయనకు బాగా తెలుసునని, నేను చాలా పెద్ద రౌడీలా ఉండేవాడిని ఆయన చెప్పుకొచ్చారు.
ఆయన సినీ ప్రయాణం ఎలా జరిగిందో కూడా మోహన్ బాబుకి తెలుసని ప్రముఖ దర్శకుడు సాగర్ అన్నారు. అయితే మోహన్ బాబు ఒక ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయారు. ఒకానొక సందర్భంలో ఆయన కుమారుల మెంబర్ షిప్ కి సంబంధించి చెక్స్ వచ్చాయి. మరో మాట లేకుండా తీసేయండి అన్నట్టు ఆయన తెలిపారు.
దానికి మోహన్ బాబు ఏంట్రా నా కొడుకులను కూడా చేర్చుకోవా అని అన్నారని దానికి సమాధానంగా నీ కొడుకులు పలు సినిమాలు చేశారని చెప్పు అప్పుడు తీసుకుంటానని ఆయన చెక్కులు రిటర్న్ పంపించినట్లు సాగర్ వివరించారు.
కావాలనుకుంటే తాను మోహన్ బాబు మెప్పుకోసం చేయవచ్చు కదా కానీ తాను అలా చేయలేదని దర్శకుడు తెలిపారు. కానీ వారికి ఇప్పుడు ఎవరు ఇచ్చారు మెంబర్షిప్ వాళ్లకి కోమాల వెంకటేష్ మెంబర్షిప్ ఇచ్చినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అతని పేరు అసిస్టెంట్ డైరెక్టర్ లిస్టులో చేర్చారు కాబట్టి కార్డు కోసం వచ్చారని ఆయన అన్నారు. అది ఆ రోజే తాను పక్కన పెట్టినట్టు వివరించారు.
ఇదంతా జరిగిన తర్వాత అదే రోజు వెంకటేష్ తనకు ఫోన్ చేసి, ఏంటి సార్ నన్ను రిజెక్ట్ చేశారు అని అడిగినట్టు ఆయన తెలిపారు. దానికి నువ్వు ఏ సినిమాలు చేసావో చెప్పు ఫలానా సినిమాలు చేశాను చెప్తే తాను కూడా ఒప్పుకుంటానని ఆయన అన్నట్టు సమాధానమిచ్చానన్నారు.
ఇకపోతే కొందరు తనకు డబ్బులు ఇస్తాను మెంబర్ షిప్ లో చేర్చుకోమని అడిగిన తాను అలాంటి వాటికి లొంగ లేదని ఆయన చెప్పుకొచ్చారు. మన డైరెక్టర్స్ యూనియన్ లో ఎంతమంది ఉన్న కనీసం ఒకరో, ఇద్దరో సాగర్ గారు ఈ తప్పు చేశారు, సాగర్ గారు ఎంత తీసుకున్నారు అని చెప్తే, అలా తను ఆ రోజే మద్రాస్ కి వెళ్ళిపోతానని ఇక చిత్ర పరిశ్రమకి తిరిగిరాని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంచేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…