Mohan Lal : నాలుగు దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమలో రాణిస్తూ అభిమానులలో తనదైన ముద్ర వేసుకున్నారు మోహనలాల్. ఇప్పటికి 400లకు పైగా సినిమాలలో నటించారు. మోహన్ లాల్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించి మెప్పించారు. ఈయనను భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. అయితే తాజాగా మోహన్ లాల్ కు జైలుకు వెళ్లే టెన్షన్ వెంటాడుతోంది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

కొంతకాలం కిందటే మోహన్ లాల్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో అధికారులు రెండు ఏనుగు దంతాలు కూడా గుర్తించారు. అయినా కూడా అపుడు మోహన్ లాల్ పై ఐటి శాఖ కేసు నమోదు చేయలేదు. అయితే తరువాత ఐటీ వారు విడిచిపెట్టినా ఏనుగు దంతాల గురించి కేరళ అటవీశాఖ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించారు అని కేసుని కూడా నమోదు చేశారు.
3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం….
Actor #Mohanlal will have to face trial in the wildlife crime case booked against him for the illegal possession of two pairs of ivory as a trial court dismissed the State government’s plea to withdraw the prosecution proceedings, reports @kssudhihttps://t.co/odFX9zifBm
— The Hindu – Kerala (@THKerala) June 9, 2022
గతంలో ఈ ఏనుగు దంతాల కేసు విషయమై థర్డ్ పార్టీ జోక్యం వద్దు అని ట్రయల్ కోర్టు విచారణను తోసిపుచ్చింది. అయితే.. ఇపుడు ఇద్దరు వ్యక్తులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చెయ్యడంతో కేరళ హైకోర్టు వారి వాదనలు వినేందుకు అనుమతి మంజూరు చేసింది. ఇక ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మోహన్ లాల్ కు మళ్లీ ఏనుగు దంతాల కేసు సమస్య మొదలైయ్యింది. అయితే సాధారణంగా ఎవరైనా ఇంట్లో ఏనుగు దంతాలు గనుక కనిపిస్తే అలాంటివారికి మూడు నుండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.































