Featured

ఆదిత్య 369 సీక్వెల్ కు హీరో మోక్షజ్ఞ కాదట.. మరి ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణ ఎంతటి విలక్షణ నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాదు.. రాబోయే రోజుల్లో ఇక తన వారసుడిగా మోక్షజ్ఞ ను కూడా రంగంలోకి దింపాడు. అతడి ఎంట్రీ కోసం ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

అయితే త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అది కూడా తన సూపర్ హిట్ సినిమా ఆదిత్య369 కి సీక్వెల్ లో నటించబోతున్నాడని బాలయ్య గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ మూవీలో హీరోగా మోక్షజ్ఞ కాకుండా బాలయ్య బాబునే ఉంటుంన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ విషయానికి వస్తే.. బాలకృష్ణ కెరియర్ లోచెప్పుకోదగిని సినిమాల్లో ఆదిత్య 369 కూడా ఒకటి. ఈ సినిమాతోనే బాలయ్య ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. బాలయ్య డ్యూయల్ రోల్లో చేసిన ఈ సినిమా టైం మిషన్ బ్యాక్ డ్రాప్ లో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూపించారు దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తారు. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే.. అభిమానులకు, ప్రేక్షకులు ఎంత ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. మొదట ఈ సీక్వెల్ కు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం గట్టిగానే జరిగింది .

అంతేకాదు స్వయంగా ఈ సినిమాను బాలయ్య డైరెక్ట్ చేస్తానన్నారు కూడా. అయితే ఈ సీక్వెల్ కి స్క్రిప్టు కూడా పూర్తి అయినట్లు సమాచారం. అప్పటికి టైం మిషన్ కు ఇప్పటి టెక్నాలజీని జోడించి భూత భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించే ఈ టైమిషన్ స్టోరీ రెడీ అయినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో బాలయ్య దర్శకత్వం వహించడం లేదని తెలుస్తోంది. ఈ సీక్వెల్ మూవీని కూడా మళ్లీ సింగితం శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తారంటూ టాక్ వినిపిస్తోంది. అలాంటి అవకాశం లేకపోతే.. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో వేరే దర్శకుడు ఈ ప్రాజెక్టు చేపడతారని సమాచారం. ఈ సినిమాలో దాదాపు బాలకృష్ణానే హారోగా ఫైనల్ అయ్యినట్లు టాక్. ఇక అతడి వారసుడు మోక్షజ్ఞ కోసం బాలయ్య ఏం ప్లాన్ చేశాడో.. ఏంటో మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

3 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

6 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

6 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

6 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

8 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

8 hours ago