చాలామంది పెళ్లైన మహిళలకు గర్భవతి కావడం కల. పెళ్లై చాలా సంవత్సరాలే అయినా సంతాన భాగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే వాళ్లు చాలామంది చాలామంది ఉంటారు. అయితే పెళ్లైన మహిళలు కొన్నిసార్లు ప్రెగ్నెంట్ అయినా కడుపులో బిడ్డ ఉండదు. ఈ గర్భాన్ని ముత్యాల గర్భం అంటారు. ఈ గర్భం గురించి మహిళలు అవగాహన ఏర్పరచుకుంటే మంచిది. సాధారణంగా మహిళలు గర్భవతి అయిన తరువాత మూడో నెల నుంచి బిడ్డ పెరుగుదల మొదలవుతుంది.
అయితే ముత్యాల గర్భంలో మాత్రం సాధారణ పెరుగుదలతో పోలిస్తే వేగంగా కడుపు పెరుగుతుంది. చాలామంది వేగంగా గర్భం పెరిగితే కవలపిల్లలు ఉండవచ్చని భ్రమ పడతారు. అయితే కడుపులో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే ఉండటం వల్ల ముత్యాల గర్బం వస్తుంది. కడుపులో ఆకారం ముత్యాలలా బుడగల రూపంలో ఉంటుంది. ముత్యాల గర్భంలో కడుపులో బిడ్డ ఎదగదు.
ముత్యాల గర్భంలో వాంతులు కావడంతో పాటు ప్రెగ్నన్సీ హార్మోన్లు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. ఆరోగ్యంగా ఉన్న స్పెర్మ్, ఆరోగ్యంగా ఉన్న అండంతో సంయోగం చెందితే ఆరోగ్యకరమైన బిడ్డ పుడతాడు. అలా కాకుండా ఖాళీ అండంతో రెండు మగ క్రోమోజోములు కలవడం వల్ల ముత్యాల గర్భం ఏర్పడుతుంది. వైద్యులు బీటా హెచ్సీజీ అనే హార్మోన్ ను టెస్ట్ చేసి ముత్యాల గర్భమో కాదో తెలుస్తారు.
బయాప్సీ పరీక్ష చేయడం ద్వారా ముత్యాల వంటి కణాలను నిర్ధారించడం సాధ్యమవుతుంది. గర్భం వచ్చిన వారు వైద్యుడిని సంప్రదించడం ద్వారా ముత్యాల గర్భమో సాధారణ గర్భమో సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…