Featured

Mosagallaku Mosagadu : ఆడవాళ్లు చూడరు.. ఫస్ట్ రన్ లో వసూళ్ళు రాబట్టదని ఈ సినిమా గురించి చెప్పిన ఆ స్టార్ హీరో తెలుసా.!!

“పద్మాలయా స్టూడియోస్” కృష్ణ పెద్దకుమార్తె పద్మాలయ పేరుమీదుగా, సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాతలుగా ఏర్పడిన కృష్ణ స్వంత బ్యానర్. 1970లో తానే కథానాయకునిగా ఆ పతాకంపై తొలి సినిమా “అగ్నిపరీక్ష” పరాజయం పాలైంది. ఆ సమయంలో మద్రాసు థియేటర్లలో విజయవంతమవుతున్న “మెకన్నాస్ గోల్డ్” వంటి కౌబాయ్ చిత్రాలపై కృష్ణ దృష్టిపడింది. మెకన్నాస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాంటి సినిమాలను కలుపుకుని ఓ కథ తయారుచేసి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలన్న ఆలోచన కృష్ణకు వచ్చింది. కృష్ణ ఆ బాధ్యతలను అప్పగించగా కౌబాయ్ నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ మోసగాళ్ళకు మోసగాడు కథని ప్రముఖ రచయిత ఆరుద్ర రాశారు.

సినిమాకి కథ, చిత్రానువాదం, మాటలతో పాటుగా పాటలను కూడా ఆరుద్రే రాశారు. అయితే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పూర్తిచేసి నిర్మాతలకు ఇచ్చాకా వారికి అది బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకు ఆరుద్ర దర్శకత్వం వహిస్తేనే బావుంటుందని భావించిన నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఘట్టమనేని హనుమంతరావు ఆయనకు దర్శకత్వం ఆఫర్ చేశారు. అయితే తన పరిమితులు తెలిసిన ఆరుద్ర దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. దాంతో ఇక వేరే దారిలేక అప్పటికే విజయలలితతో “రౌడీరాణి” అనే యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించిన కె.ఎస్.ఆర్.దాస్‌ని దర్శకునిగా తీసుకున్నారు. సినిమాకి మొదట “అదృష్టరేఖ” అన్న పేరు పెడదామని భావించారు, కానీ చివరకు “మోసగాళ్ళకు మోసగాడు” అన్న పేరు పెట్టారు.

“మోసగాళ్ళకు మోసగాడు” సినిమాను రాజస్థాన్ లో ఎడారులు, బికనీర్ కోట, పంజాబ్ లోని సట్లెజ్ నది తీరం, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాకిస్తాన్-చైనా సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్తాన్ కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకువెళ్ళారు. సినిమాలో కృష్ణని మొట్టమొదటిసారి కౌబాయ్ గా కాస్ట్యూంస్ చేసిన బాబూరావు, వెంకట్రావు, మేకప్ మేన్ మాధవరావు తీర్చిదిద్దారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వి.ఎస్.ఆర్.స్వామి వ్యవహరించారు.

మోసగాళ్ళకు మోసగాడు అమెరికన్ సినిమాల్లోని కౌబాయ్ సినిమాల జానర్ తో వచ్చింది. కౌబాయ్ అంటే ఉత్తర అమెరికాలో పశువుల మందలను మేపుతూ, వాటికి కాపలాగా ఉంటూ గుర్రాలపై సంచరించే వ్యక్తి. 19, 20వ శతాబ్దాల్లో అమెరికాలో ఈ కౌబాయ్ పాత్రలను, స్థానిక అమెరికన్ల పాత్రలను రొమాంటిసైజ్ చేస్తూ వెల్డ్ వెస్ట్ షోలు ప్రాచుర్యం పొందాయి. 1920ల నుంచి నేటివరకూ ఆంగ్లంలో పలు కౌబాయ్ సినిమాలో వచ్చాయి. వీటిలో కౌబాయ్ లు నెగిటివ్ గానూ, పాజిటివ్ గానూ కూడా కనిపిస్తారు. కొన్ని సినిమాల్లో కౌబాయ్ లు గ్యాంగ్ స్టర్లుగానూ, మరికొన్నిటిలో దేశభక్తి, సాహసం, ధైర్యం వంటి గుణాలతో కౌబాయ్ కోడ్ వంటి సద్లక్షణాలతోనూ కనిపిస్తారు. మొత్తానికి ఆంగ్ల చిత్రాల్లో కౌబాయ్ ఓ ప్రత్యేకమైన జానర్ గా రూపుదిద్దుకుంది.

ఇలాంటి పూర్తిగా అమెరికన్ సంస్కృతికి చెందిన కౌబాయ్ నేపథ్యంలో సినిమాను రూపొందించి తెలుగు వారిని ఆకట్టుకునేందుకు రచయిత ఆరుద్ర చాలా కృషి చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిది పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన నేరస్తుల్ని పట్టించి డబ్బు సంపాదించే బౌంటీ హంటర్ పాత్ర. నేపథ్యం కౌబాయ్ లాంటివి సమకాలీన సమాజంలో కానీ, సమీప గతంలో కానీ లేవు కనుక ఈ సినిమా కాలాన్ని బ్రిటీష్ వారూ, ఫ్రెంచ్ వారూ దేశంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న రోజుల్లో సెట్ చేశారు.
సినిమాలో నాగభూషణం పోషించిన పాత్ర ప్రముఖ ఆంగ్ల కౌబాయ్ చిత్రం గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాలోని అగ్లీ పాత్రను ఆధారం చేసుకుని తయారుచేశారు.

అలాగే ఈ సినిమా ప్రివ్యూ చూసిన ఎన్టీ రామారావు కృష్ణ కొత్త ఎక్స్పరిమెంట్ చేయడం బాగుందని.. కాకపోతే ఆడవాళ్ళు ఈ సినిమాకు రారని..సెకండ్ రన్, థర్డ్ రన్ లో వసూళ్ళు రాబడుతుందని ఆయన చెప్పారు. సరిగ్గా ఎన్టీ రామారావు చెప్పినట్టుగానే.. మహిళా ప్రేక్షకులు దూరం ఉన్నప్పటికీ.. “మోసగాళ్లకు మోసగాడు” చిత్రం లాంగ్ రన్ లో విజయదుందుభి మోగించింది. ఆ తర్వాత అనేక కౌబాయ్ చిత్రాలకు ఇది ఒక ప్రేరణగా నిలిచింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

22 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago