General News

వివాహేతర సంబంధం.. అడ్డుగా వచ్చాడని మూడేళ్ల కొడుకును చంపేసింది ఓ తల్లి..!

కూరగాయల కోసం అంటూ తన కొడుకును తీసుకొని వెళ్లిన వివాహిత మార్కెట్ కు వెళ్లకుండానే ఓ గెస్ట్‌హౌస్‌కి వెళ్లింది. అక్కడ ఆమె ప్రియుడిని కలిసింది. వాళ్లిద్దరు శృంగారంలో ఉండగా.. తన కొడుకు ఏడ్వడం మొదలు పెట్టాడు. ప్రియుడికి కోపం వచ్చి.. మన మధ్య ఏంటీ నస అంటూ కసురుకున్నాడు. ఆ తల్లికి కూడా తన మూడేళ్ల కుమారుడు ఏడుస్తుండగా చిరాకు వేసింది.

ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటాడు… ఛిఛీ అని విసుక్కుంది. ఆ కోపంలో తన కొడుకును వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇద్దరూ కలిసి పిల్లాణ్ని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా పాలలో పురుగుల మందు కలిపారు. తర్వాత బాబుకు పట్టించారు. క్షణాల్లోనే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వాళ్లకు అడ్డు లేకపోవడంతో శృంగారంలో మునిగి తేలారు. తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో పిల్లాడ్ని తీసుకొని కూరగాయలను తీసుకొని ఇంటికి వెళ్లింది.

తన కుమారుడిని మంచంపై పడుకోబెట్టి ఇంటి పనులు చేస్తుంది. దీంతో అక్కడకు వాళ్ల తాత వచ్చాడు. పిల్లాడితో ఆడుకుందామని ప్రయత్నిస్తే… పిల్లాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే తల్లితో సహా అక్కడ అందరూ ఆందోళన చెందారు. వెంటనే గుజరాత్ లోని అమ్మదాబాద్ లో గల శారదాబెన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పిల్లడ్ని ఇచ్చేయండంటూ తల్లి ఏడుస్తూ డ్రామా మొదలు పెట్టింది. అలా పిల్లాణ్ని ఇవ్వలేమనీ… పోలీసులు మాత్రమే ఇస్తారని చెప్పి… కాల్ చేశారు. కాసేపటికి వచ్చిన షాహెర్ కొతాడా నగర పోలీసులు పోస్ట్ మార్టం జరిపించమన్నారు. దీంతో అసలు నిజం బయటకు వచ్చింది.

పిల్లాడి పొట్టలో పురుగుల మందు అవశేషాలు కనిపించాయి. దీంతో తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఆమె నిజం ఒప్పుకుంది. దాంతో… పోలీసుల ముందే ఆమె భర్త ఆమెను చితకబాదబోతే… పోలీసులు అడ్డుకున్నారు. తన కొడుకును తల్లే చంపేసిందని తెలిసి… ఆ తండ్రి అజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయం ఎలాగోలా తెలుసుకున్న ప్రియుడు భరత్ పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. అతని కోసం గాలింపు చేపట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago