General News

ఎవరెస్టు ఎక్కాలంటే ఇక పై 13 లక్షలు చెల్లించాలిసిందే..

ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే అత్యంత ఎతైన శిఖరాలలో ఒకటీ. ఈ ఎవరెస్టు శిఖరం నేపాల్ లో వుంది,దీనిని అధిరోహించడానికి ప్రతి సంవత్సారం నేపాల్ కి వందలాది మంది పర్యాటకులు వెళ్తూవుంటారు.అయితే నేపాల్ ప్రభుత్వం ఎవరెస్టు అధిరోహించేవారికి కొత్త ప్రతిపాధనలన్ని ప్రవేశపెట్టింది. గతంలో ఎవరెస్టు శిఖరం ఎక్కాలంటే 11 వేల డాలర్లు చెల్లించాల్సి వచ్చేది,తాజాగా ఆ ఫీజు ను 15 వేల డాలర్లుకు (ఇండియన్ కరెన్సీ లో దాదాపు 13 లక్షలు )పెంచినట్లు టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ ప్రసాద్ వెల్లడించారు. పది సంవత్సారాలు గ ఈ ఫీజులని సవరించలేదని అందుకే కొత్త ప్రతిపాదనలు సెప్టెంబర్ 2025 నుండి అమలలోకి వస్తాయని తెలిపారు.


అంతేకాకుండా పర్వతారోహణకు వచ్చేవారికి ఒక్కో సీజన్ కి ఒక్కో ఫీజుని కేటాయించారు,తక్కువ పాపులారిటీ వున్నా సెప్టెంబర్_నవంబర్ సీసన్ కి 7,500 (రూ .6.47 లక్షలు ) డాలర్లు, డిసెంబర్_ ఫిబ్రవరి సీజన్ ఫీజును 3,750 డాలర్లు(రూ 3.23 లక్షలు) గా పెంచినట్లు తెలిపారు. ఈ పెంచిన ఫీజులని ప్రభుత్వం ఎవరెస్ట్ పరిశుభ్రతకు ఉపయోగిస్తుందని టూరిజం అధికారులు తెలియజేసారు..నేపాల్ కి అధిక సంఖ్యలో వచ్చే టూరిస్టులు ఎవరెస్టు ని అధిరోహించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే టూరిజం శాఖా మాత్రం ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రతి ఏడాది 300 మందికి మాత్రం అవకాశం కల్పిస్తుంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago