Featured

Movie Artist Association: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డీల్ చేయడం మంచు విష్ణుకు చాలా సింపుల్ థింగ్… పృథ్వీ రాజ్

Movie Artist Association: పృథ్వీరాజ్ అంటేనే 30 ఇయర్స్ ఇండస్ట్రీ గా ఇంకా బాయిలింగ్ స్టార్ బబ్లు గా తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమైన వ్యక్తి. ఈయన సినిమాలలోనే కాకుండా సీరియల్ లలో కూడా నటించారు. ఈ మధ్య వివాదాలతో బాగా ఫేమస్ అయ్యారు. కొన్ని వివాదల కారణంగానే టీటీడీ కి సంబందించిన ఎస్ వి బి సి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ లో కూడా యాక్టీవ్ గా వుంటారు. కాగా ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న ఈయన మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా విష్ణు ఏం చేయగలడు అన్నారు……

మా సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్‌ లోని ఏఐజీ హాస్పిటల్ లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం కార్యక్రమానికి మా ప్రెసిడెంట్‌తో విష్ణు తో పాటు.. పలువురు మా సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే కార్యక్రమానికి వచ్చిన పృథ్వి… మా ప్రెసిడెంట్ విష్ణుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ మొదటిసాటి ఎన్నిక అయినప్పుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, అని చేలా మందికి సందేహాలు వచ్చాయన్నారు. ఏం చేయగలడు అని చాలా రకాల మాటలు వినిపించాయి. మంచు విష్ణు ఒక హీరోగా అందరికీ తెలుసు. కానీ ఆయనకు వున్నా ఎడ్యుకేషన్లు ఇనిస్టిట్యూట్లు గురించి మాట్లాడాలంటే ఒక గంట సరిపోదన్నారు. అవన్నీ మేనేజ్ చేసిన ఆయనకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డీల్ చేయడం చాలా సింపుల్ థింగ్ అని పృథ్వీ తెలియజేసారు.

మంచు విష్ణు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు అని, అంతేకాకుండా వెళ్లిన ప్రతి దగ్గర ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ ఆయనకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఇక వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది పైన ప్రశంసలు కురిపించారు. ఇది ఇలా ఉండగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ… ‘మా’ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిల ప్రకారంగా మా అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో శాశ్వత భవనానికి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. ‘మా’ అసోసియేషన్ సభ్యుల వెల్పేర్, ఆరోగ్యం తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఇక సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు విషయం గురించి మాట్లాడుతూ టిక్కెట్ల పెంపు కరెక్టా కాదా అనే అంశంపై తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago