Movie Artist Association: పృథ్వీరాజ్ అంటేనే 30 ఇయర్స్ ఇండస్ట్రీ గా ఇంకా బాయిలింగ్ స్టార్ బబ్లు గా తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమైన వ్యక్తి. ఈయన సినిమాలలోనే కాకుండా సీరియల్ లలో కూడా నటించారు. ఈ మధ్య వివాదాలతో బాగా ఫేమస్ అయ్యారు. కొన్ని వివాదల కారణంగానే టీటీడీ కి సంబందించిన ఎస్ వి బి సి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ లో కూడా యాక్టీవ్ గా వుంటారు. కాగా ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న ఈయన మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా విష్ణు ఏం చేయగలడు అన్నారు……

మా సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం కార్యక్రమానికి మా ప్రెసిడెంట్‌తో విష్ణు తో పాటు.. పలువురు మా సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే కార్యక్రమానికి వచ్చిన పృథ్వి… మా ప్రెసిడెంట్ విష్ణుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ మొదటిసాటి ఎన్నిక అయినప్పుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, అని చేలా మందికి సందేహాలు వచ్చాయన్నారు. ఏం చేయగలడు అని చాలా రకాల మాటలు వినిపించాయి. మంచు విష్ణు ఒక హీరోగా అందరికీ తెలుసు. కానీ ఆయనకు వున్నా ఎడ్యుకేషన్లు ఇనిస్టిట్యూట్లు గురించి మాట్లాడాలంటే ఒక గంట సరిపోదన్నారు. అవన్నీ మేనేజ్ చేసిన ఆయనకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డీల్ చేయడం చాలా సింపుల్ థింగ్ అని పృథ్వీ తెలియజేసారు.
మంచు విష్ణు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు అని, అంతేకాకుండా వెళ్లిన ప్రతి దగ్గర ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ ఆయనకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఇక వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది పైన ప్రశంసలు కురిపించారు. ఇది ఇలా ఉండగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ… ‘మా’ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిల ప్రకారంగా మా అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో శాశ్వత భవనానికి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. ‘మా’ అసోసియేషన్ సభ్యుల వెల్పేర్, ఆరోగ్యం తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఇక సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు విషయం గురించి మాట్లాడుతూ టిక్కెట్ల పెంపు కరెక్టా కాదా అనే అంశంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.






























