Movie News

Mrunal Thakur: హైదరాబాదులో ఇల్లు కొన్న మృణాల్… అడ్రస్ చెబుతారా అంటూ స్పందించిన నటి!

Mrunal Thakur: బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ సీరియల్ నటిగా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందిన ఈమె తెలుగులోకి సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇలా మొదటి సినిమాతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమెకు పెద్ద ఎత్తున తెలుగులో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇలా వరుస తెలుగు సినిమాలలో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె గురించి సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈమె తరచూ షూటింగ్లో నిమిత్తం హైదరాబాద్ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ హోటల్లో ఉండలేక స్వయంగా హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తల పైన నటి మృణాల్ స్పందించారు.

Mrunal Thakur: నేను నా ఇంటిని చూస్తాను…


ఈ సందర్భంగా తాను హైదరాబాద్ లో ఇల్లు కొన్నాననే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించిన ఈమె నా ఇంటి అడ్రస్ నాకు కాస్త చెబుతారా నేను కూడా నా ఇంటిని చూస్తాను అంటూ కామెంట్ చేశారు. ఇలా ఈమె కామెంట్ చేశారు అంటే ఇల్లు కొన్నట్టు వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిసిపోతుంది. ఇక హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇల్లు కొనాలని ఎవరికైతే ఉండదు అంటూ కూడా ఈమె చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఈమె హైదరాబాదులో ఇల్లు కొనాలనే ఆలోచనలో కూడా ఉందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago