Mrunal Thakur: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా మారాలంటే రాత్రికి రాత్రి వారు కష్టపడి స్టార్ సెలబ్రెటీలుగా మారిపోరు.ఎన్నో అవమానాలు నిందలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ అహర్నిశలు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం కష్టపడితేనే వారికి స్టార్ హీరో హీరోయిన్ అనే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇలా సీతారామం సినిమా ద్వారా స్టార్ అయినటువంటి మృణాల్ సైతం రాత్రికి రాత్రి స్టార్ కాలేదని ఆమె స్టార్ డమ్ వెనుక ఎన్నో అవమానాలు నిద్రలేని రాత్రులు ఉన్నాయని తెలుస్తోంది.
మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈమె తండ్రి ఒక బ్యాంకు ఉద్యోగి అయితే తన కూతురిని డాక్టర్ ను చేయాలన్న తన కోరికను ఈమె నెరవేర్చింది. ఈ క్రమంలోనే డెంటల్ డాక్టర్ కోర్సులో చేరినటువంటి ఈమెకు తర్వాత మీడియా వైపు మనసు మళ్లడంతో తన తల్లిదండ్రులను ఒప్పించి బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా కోర్సులో చేరింది. అయితే అది ఏం చదువు అంటూ తన తండ్రిని సహ ఉద్యోగులందరూ అవహేళనగా మాట్లాడటంతో నాన్న ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లారు.
ఈ విధంగా తన తండ్రి డిప్రెషన్ లో ఉండగా తనని బాధ పెట్టానని ఈమె కూడా ఎంతగానో బాధపడిందంట ఆ సమయంలో చనిపోదామనే ఆలోచనలు కూడా వచ్చాయని అయితే తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి తాను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని తెలిపారు.ఇక బలవంతంగా ఈ కోర్స్ పూర్తి చేసినప్పటికీ స్నేహితుల సలహా మేరకు తాను ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు చదువుపై దృష్టి పెట్టానని అలా పలు సీరియల్స్ లో అవకాశం వచ్చిన తనకు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సుల్తానా సినిమాలో అవకాశం వచ్చినా చివరికి తనని తీసేసి అనుష్క శర్మను తీసుకున్నారు.
అనంతరం ఈమె పలు సినిమా ఆడిషన్స్ కి వెళ్తూ లవ్ సోనియా అనే సినిమాలో అవకాశం అందుకున్నారు. ఇక ఈ సినిమాలో డబ్బు కోసం చెల్లెల్ని వేశ్య గృహానికి అమ్మేస్తే తన చెల్లెల్ని ఎలా రక్షించుకొని తీసుకువచ్చే అక్క పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో నటించడం కోసం దాదాపు రెండు వారాలపాటు వేశ్య గృహంలో ఉండి వారు చెప్పే కథలను విన్నానని వారు చెప్పిన కథలు విని తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఈమె తెలిపారు అయితే ఆ సమయంలో డైరెక్టర్ తనకు కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు. అలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చానని ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా సమయంలోనే నాగ అశ్విన్ తో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం సీతగా మీ ముందు నిలబెట్టడం జరిగిందంటూ ఈ సందర్భంగా ఈమె తన జీవితంలో జరిగిన చేదు సంఘటనలను తెలియజేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…