Mrunal Thakur: బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్నటువంటి మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలను అందుకొని బిజీ అవుతున్నారు. మొదటి సినిమాతో చీర కట్టులో అచ్చ తెలుగు అమ్మాయిలా అందరి మనసులు దోచేసిన మృణాల్ కాస్త గ్లామర్ డోస్ పెంచేసారని చెప్పాలి.
ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నటువంటి ఈమె తరచూ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బ్లూ కలర్ బికినీ ధరించి గ్లామర్ షో చేస్తున్నారు. ఇలా బికినీలో ఉన్న ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలపై కొందరు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
బికినీ ధరించి గ్లామర్ డోస్ పెంచారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం మీరు చీరలోనే చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే మీ నుంచి ఇది అసలు ఊహించలేదు అంటూ కామెంట్ చేశారు. ఇక ఒక నెటిజన్ అయితే ఏకంగా RIP సీతామహాలక్ష్మి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…