Featured

MS Dhoni : ఇండియన్ క్రికెటర్ ధోనిని పొగడ్తలతో ముంచెత్తిన సమంత… రీజన్ ఏంటంటే ?

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని శకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. కెప్టెన్ కూల్ గా ప్రపంచ క్రికెట్లో కీర్తి అందుకున్న ధోనీ.. ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచంలో ఇప్పటికీ బెస్ట్ ఫినిషర్ ధోనీయే అని కోహ్లీ తాజాగా వ్యాఖ్యానించడమే ధోనీ స్టామినాకు నిదర్శనం. కాగా ఈ మిస్టర్ కూల్ తాజాగా హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లలో ఇరగదీశాడు.

ms dhoni unacademy ad goes viral and samantha appreciates it

తాజాగా రిలీజైన అన్ అకాడమీకి సంబంధించిన వ్యాపార ప్రకటనలో మహేంద్ర సింగ్ ధోని నటించి ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. ఈ వ్యాపార ప్రకటనలో వెనుక రైలు వస్తూ ఉండగా తనకు అడ్డుగా నిలిచిన గోడలను ధోని ఛేదించుకొంటూ వెళ్లే సీన్లు, అలాగే గ్రాఫిక్స్ సీన్లు వావ్ అనిపించే విధంగా ఉన్నాయి. ఈ వీడియో విడుదల చేసిన కొద్ది సేపట్లోనే పది లక్షలకుపైగా వ్యూస్‌ను సాధించింది. ప్రస్తుతం ధోని నటించిన తీరుపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ms dhoni unacademy ad goes viral and samantha appreciates it

ఈ యాడ్‌ గురించి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ… వావ్. ఎంఎస్ ధోని కొట్టే హెలిక్టాప్టర్ షాట్ కంటే గొప్పగా ఉంది. ఇది కేవలం ధోని స్టోరినే కాదు.. ప్రతీ క్రికెటర్ కథ. జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎలా అధిగమించాలనే విషయాన్ని స్పూర్తిదాయకంగా చూపించాడు. ఇది మంచి మనోవికాస పాఠంగా అనిపించింది అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

పదే పదే ఆ వీడియోను చూస్తున్న సమంత ?

అలానే సమంత కూడా స్పందిస్తూ… లెస్సన్ నంబర్ 7 జీవితానికే ఓ పాఠం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా ఎదుర్కొనాలనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. ఈ వీడియోను పదే పదే చూస్తూనే ఉండిపోయాను. ఎందరికో ప్రేరణగా నిలిచేందుకు అన్ అకాడమీ రూపొందించిన వీడియో సహాయ పడుతుంది అని సమంత తన ట్వీట్‌లో పేర్కొన్నది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

10 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

10 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

10 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

11 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

11 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

11 hours ago