MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని శకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. కెప్టెన్ కూల్ గా ప్రపంచ క్రికెట్లో కీర్తి అందుకున్న ధోనీ.. ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచంలో ఇప్పటికీ బెస్ట్ ఫినిషర్ ధోనీయే అని కోహ్లీ తాజాగా వ్యాఖ్యానించడమే ధోనీ స్టామినాకు నిదర్శనం. కాగా ఈ మిస్టర్ కూల్ తాజాగా హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లలో ఇరగదీశాడు.

తాజాగా రిలీజైన అన్ అకాడమీకి సంబంధించిన వ్యాపార ప్రకటనలో మహేంద్ర సింగ్ ధోని నటించి ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. ఈ వ్యాపార ప్రకటనలో వెనుక రైలు వస్తూ ఉండగా తనకు అడ్డుగా నిలిచిన గోడలను ధోని ఛేదించుకొంటూ వెళ్లే సీన్లు, అలాగే గ్రాఫిక్స్ సీన్లు వావ్ అనిపించే విధంగా ఉన్నాయి. ఈ వీడియో విడుదల చేసిన కొద్ది సేపట్లోనే పది లక్షలకుపైగా వ్యూస్‌ను సాధించింది. ప్రస్తుతం ధోని నటించిన తీరుపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ యాడ్ గురించి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ… వావ్. ఎంఎస్ ధోని కొట్టే హెలిక్టాప్టర్ షాట్ కంటే గొప్పగా ఉంది. ఇది కేవలం ధోని స్టోరినే కాదు.. ప్రతీ క్రికెటర్ కథ. జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎలా అధిగమించాలనే విషయాన్ని స్పూర్తిదాయకంగా చూపించాడు. ఇది మంచి మనోవికాస పాఠంగా అనిపించింది అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
పదే పదే ఆ వీడియోను చూస్తున్న సమంత ?
అలానే సమంత కూడా స్పందిస్తూ… లెస్సన్ నంబర్ 7 జీవితానికే ఓ పాఠం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా ఎదుర్కొనాలనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. ఈ వీడియోను పదే పదే చూస్తూనే ఉండిపోయాను. ఎందరికో ప్రేరణగా నిలిచేందుకు అన్ అకాడమీ రూపొందించిన వీడియో సహాయ పడుతుంది అని సమంత తన ట్వీట్‌లో పేర్కొన్నది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.
































