Featured

Uday Kiran: చిరంజీవి ఉదయ్ కిరణ్ ను ఫ్యామిలీలో కలుపుకుందాం అనుకున్నాడు కానీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్..

Uday Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒక ఏడాదిలోనే ఏకంగా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలలో నటిస్తూ హిట్ కొట్టిన వారిలో హీరో ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన స్టార్ డమ్ చూసి అగ్ర హీరోలు దర్శక నిర్మాతలు సైతం ముక్కున వేలు వేసుకున్నారు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా బ్యానర్లన్నీ కూడా ఉదయ్ కిరణ్ కోసం క్యూలో నిలబడ్డాయి.

ఈ విధంగా ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో స్టార్ హీరో అయ్యారు. అయితే ఈయన ఎంత తొందరగా స్టార్ డమ్ సంపాదించుకున్నారో అంతే తొందరగా తన కెరీర్ కు ఫుల్ స్టాప్ కూడా పెట్టారు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అవ్వడంతో ఈయన సినిమాలు సక్సెస్ కాక సతమతమయ్యారు. చివరికి అవకాశాలు కూడా లేకపోవడంతో ఎంతో ఆందోళనకు గురై ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ కు చిరంజీవికి మధ్య ఉన్న రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అయితే ఉదయ్ కిరణ్ కు హైపర్ టెన్షన్ ఎక్కువ. ఒక్కోసారి విపరీతమైన బిపి వస్తుంది ఆ టైంలో ఆయన తన కంట్రోల్లో ఉండరు. అలాంటి సమయంలో సిచువేషన్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోయారు.

ఉదయ్ కిరణ్ హైపర్ టెన్షన్ తో బాధపడుతూ కంట్రోల్ తప్పేవారు…

ఇలా బాధపడుతున్న ఉదయ్ కిరణ్ ను మేము హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించగా డాక్టర్ మీరు ఇలా ఆవేశ పడకూడదు ప్రశాంతంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పారు. అప్పటికి సరే అని చెప్పిన ఉదయ్ కిరణ్ యధావిధిగా హైపర్ టెన్షన్ తో బాధపడేవారు. ఇకపోతే ఇండస్ట్రీలో చిరంజీవి ఎవరైనా ఒక హిట్ సినిమాలో నటిస్తే వారికి ఫోన్లు చేసి అభినందించడం ఆయన లక్షణం.ఈ క్రమంలోనే అప్పట్లో ఉదయ్ కిరణ్ మంచి సినిమాలు చేయడంతో తరచూ ఉదయ్ కిరణ్ ను అభినందించడమే కాకుండా ఆయనని తన ఇంటి అల్లుడిగా చేసుకోవాలని కూడా భావించారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ప్రకటన వెలబడటమే కాకుండా తన కూతురితో నిశ్చితార్థం కూడా జరిపించారు.అయితే ఏమైందో తెలియదు కానీ ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వటమే కాకుండా ఉదయ్ కిరణ్ సినిమాలో కూడా ఫ్లాప్ అవుతూ చివరికి అవకాశాలు లేకపోవడంతో అతను కూడా డిస్టర్బ్ కావడం వల్లే అలా సూసైడ్ చేసుకున్నారేమో అంటూ మురళి మోహన్ తెలిపారు. ప్రస్తుతం మురళీమోహన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago