Pushpa 2: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. డిసెంబర్ నెలలో విడుదలయ్యి దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విధంగా పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ రష్మిక క్రేజ్ కూడా పెరిగిపోయింది.
ఈ విధంగా అల్లు అర్జున్ రష్మిక కాంబినేషన్లో ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మొదటి వారం లేదా రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాని పుష్ప సినిమాకు మించి ఉండేలా సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.పుష్ప సినిమా భారీ అంచనాలను పెంచడంతో ఈ సినిమాని అంతకుమించి చేయాలని సుకుమార్ భావించారట. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఈ సినిమా కోసం ఏకంగా మైత్రి మూవీ మేకర్స్ వారు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా బడ్జెట్ లో భాగంగా నటీనటులకు కూడా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందిస్తున్నట్లు సమాచారం. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా సీక్వెల్ చిత్రానికి అల్లు అర్జున్ ఏకంగా 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సుకుమార్ సైతం 18 కోట్ల నుంచి 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…