Murali Mohan: టాలీవుడ్ క్రేజీ కపుల్స్ సమంత నాగచైతన్య విడిపోయి దాదాపు సంవత్సరం కావస్తున్న ఇప్పటికి వీరి విడాకులకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సమంత నాగచైతన్య గురించి సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ మాట్లాడుతూ…ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో మూడు అపార్ట్మెంట్ లు కట్టుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కట్టుకున్నవి. ఆ అపార్ట్మెంట్ నచ్చడంతో నాగచైతన్య అమ్ముతారా అని అడిగారు. అయితే తాను మా కోసం కట్టుకున్నవని చెప్పడంతో నాగచైతన్య ఈ విషయం నాగార్జునకి చెప్పారు. నాగచైతన్యకు అపార్ట్మెంట్ నచ్చింది తనకు ఇవ్వండి అని నాగార్జున అడగడంతో కాదనలేకపోయాను.
మా అబ్బాయి కోసం కట్టించిన అపార్ట్మెంట్ నాగచైతన్యకు ఇచ్చాను.నాగచైతన్య సమంత ఇద్దరు అదే అపార్ట్మెంట్లో ఉండేవాళ్లు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటూ సంతోషంగా గడిపేవారు.ఎప్పుడూ కూడా వీరి మధ్య గొడవ జరిగినట్టు తాను వినలేదని అలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోతున్నారనే విషయం నాకు ఏమాత్రం తెలియదని మురళీమోహన్ తెలిపారు.
సమంత నాగచైతన్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు…
నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని విడిపోతున్నారని మా పనిమనిషి వచ్చి చెప్పే వరకు నాకు తెలియదని మురళీమోహన్ తెలిపారు.అయితే అప్పటికే నాగచైతన్య అపార్ట్మెంట్లో కాకుండా వేరే హోటల్లో ఉండేవారు.దీంతో ఇద్దరు విడాకులు తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారని భావించాను.ఇలా విడాకులు తీసుకొని విడిపోతున్నారనే విషయం పనిమనిషి ద్వారా తెలిసింది. కానీ అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారనే విషయం ఇప్పటికీ తనకు తెలియదని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…