Music Director Koti : సాలూరి రాజేశ్వర్రావు గారి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రి లాగానే సంగీత దర్శకుడిగా మారిన సాలూరి కోటేశ్వరరావు అలియాస్ కోటి గారి సంగీతం గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కోటి మొదట రాజ్ తో కలిసి రాజ్ కోటి కాంబినేషన్ లో చాలా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఇక ఆ తరువాత ఇద్దరూ పలు కారణాలతో విడిపోయి ఎవరికి వారు సొంతంగా మ్యూజిక్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో కూడా హిట్లర్, హలో బ్రదర్, బంగారు బుల్లోడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి కోటి గారికి. చిరంజీవి కాంబినేషన్ లో దాదాపు 11 సినిమాలు చేసి హిట్లు కొట్టిన కోటి గారికి చిన్న చిన్న మనస్పర్తల కారణంగా చిరంజీవి గారికి దూరం అయ్యారు. ఇక కెరీర్ లో ఒడిదుడుకులను ఇంటర్వ్యూలో పంచుకున్నారు కోటి.

బాలకృష్ణ తో సినిమా వల్ల బాగా నష్టపోయాను…
మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయమంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ వైపు వెళ్లాలని అనిపించి బాలకృష్ణ సినిమా కోదండ రామి రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమాకు నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. అప్పట్లోనే ఎనిది లక్షలకు డిస్ట్రిబ్యూషన్ కొన్నాను. సంగీత దర్శకుడిని సినిమాకు నేనే కావడంతో సినిమా మంగమ్మ గారి మనవడు సినిమా రేంజ్ లో ఉంది అని అంత హిట్ అవుతుందని భావించి చాలా నమ్మకం పెట్టుకుంటే సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మొత్తం పెట్టిన డబ్బులు పోయాయి. ఇక మళ్ళీ ఇంకో వ్యాపారం మొదలు పెట్టినా అప్పుడు కూడా అలానే జరిగింది అంటూ చెప్పారు.

మోహన్ బాబు మీద అరిచాను…
సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో ఎవరైనా మధ్యలో దూరి సలహాలు ఇస్తే నచ్చదట కోటి గారికి. ఆ విషయంలో బాగా కోపం వస్తుంది. ఇలా ఒకసారి మోహన్ బాబు గారు కలగజసుకోవడంతో కోపం వచ్చి ఆర్క్కెస్ట్రాకు ప్యాక్ అప్ చెప్పి వెళ్లిపోతుంటే మోహన్ బాబు గారు కోపంగా ప్యాక్ అప్ అన్నారు. కోపంతో నా ఆర్కెస్ట్రాకు మీరు ప్యాక్ అప్ చెప్పడమేంటి అంటూ బయటికి వచ్చేసాను. బి గోపాల్ గారి కాంబినేషన్ సినిమాకు ఇలా జరిగింది. మోహన్ బాబు గారు కోపంతో వెళ్లిపోయారు. మళ్ళీ బి గోపాల్ గారు కలుగజేసుకుని మాట్లాడి మళ్ళీ ఒప్పించారు. వ్యక్తిగతంగా ఎవరి పైనా కోపం తెచ్చుకోను కానీ పని విషయంలో మాత్రం కోపం తగ్గదు అంటూ చెప్పారు.