Featured

Music Director Koti : సరిగమప సింగర్ చరణ్ తో లవ్ స్టోరీ, పెళ్లిపై శ్రీముఖి నాకు చెప్పింది ఇదే : కోటి

Music Director Koti : జీ తెలుగులో వస్తున్న సరిగమప సింగింగ్ షో ముగిసింది, ఫైనల్స్ చాలా గ్రాండ్ గా చేసారు. ఇక సింగర్స్ అంతా పోటా పోటీగా పాల్గొన్న ఈషో ఫైనల్స్ లో సింగర్ శృతిక విన్నర్ గా నిలిచి గెలిచింది. ఇక సుధాన్ష్ గట్టిపోటీ ఇచ్చినా శృతిక విన్నర్ అయింది. ఇక ఈ షో గురించి తన జ్ఞాపకాలను పంచుకున్నారు సంగీత దర్శకుడు, అలాగే సరిగమప సింగింగ్ షో జడ్జి కోటి గారు. ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన కోటి గారు ప్రస్తుతం జీ టీవీ లో సింగింగ్ షో కి జడ్జి గా వ్యవహారిస్తున్నారు. విన్నర్ శృతిక గురించి అలాగే సింగర్ చరణ్ శ్రీముఖి మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడారు.

శ్రీముఖిని అడిగితే తాను చెప్పింది ఇదే…

శృతిక ను ఆడిషన్స్ టైములో మొదట హోల్డ్ లో ఉంచారట కోటి గారు. దీనికి కారణం తాను ఆల్రెడీ బోల్ బేబీ బోల్ వంటి మ్యూజిక్ షోలో పాల్గొని వచ్చిన అమ్మాయి. తన గొంతు నాకు తెలుసు. ఇప్పుడు వచ్చే వాళ్లలో ఒక ఫ్రెష్ గొంతు ఉంటుంది తాను పాత పద్దతి లోనే పాడుతుందేమో అన్న సందేహంతో, కొత్త వాళ్లకు అవకాశం ఇద్దామని అనుకుని హోల్డ్ లో పెట్టాను కానీ స్మిత, శైలజ గారు మాత్రం లేదు తనకు ఇంకో అవకాశం ఇద్దామని అన్నారు. అలా శృతిక షో లో పాల్గొనింది. ఒక్క ఎపిసోడ్ లో కూడా తాను తప్పులు చేయలేదు అని చెప్పారు కోటి గారు.

చరణ్, శ్రీ ముఖి ల మధ్య ఉన్నది అదే…

ఇక షో లో మరో హైలైట్ శ్రీ ముఖి, చరణ్ మధ్య లవ్ ట్రాక్. ఇక దీని మీద స్పందించారు కోటి. మొదట్లో తనకు వీళ్ళ మధ్య ఉన్న రేలేషన్ తెలియదనీ అదంతా నిజమనే అనుకున్నాను కానీ శ్రీ ముఖి ని ఒకరోజు ఏంటి అసలు విషయం ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అప్పుడు అలాంటిది ఏమి లేదు చరణ్ నాకు తమ్ముడి లాంటి వాడు అంటూ చెప్పింది. ఇక చరణ్ ని అడిగినా అలానే చెప్పాడు. కానీ వాయి మధ్య లవ్ ట్రాక్ జస్ట్ క్రియేట్ చేసిందే కానీ బాగా వచ్చింది. శ్రీ ముఖి చరణ్ వాళ్ళ నాన్న వచ్చినపుడు కూడా మావయ్య అంటూ పిలవడం, ఆట పట్టించడం, ఇక శైలజ ను అమ్మ అంటుంది తనతో వెళ్లి మాకు పెళ్లి ఎపుడు చేస్తారు అంటూ జోక్స్ వేసేది అని వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ మీద క్లారిటీ ఇచ్చారు కోటి. ఇక శ్రీ ముఖి ఎనర్జీ చాలా బాగా ఉంటుంది షో మొత్తం తాను నిలబడే ఉంటుంది. కాళ్ళు నొప్పెడతాయి కాసేపైనా కూర్చో, షో అయ్యాక స్పా కి వెళ్లి మసాజ్ చేయించుకో అని చెప్పేవాడిని అంటూ కోటి చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago