మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్లో ఫుల్ పామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం తెలుగు తమిళం ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అంతేకాకుండా చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అలా సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వాహ నడుస్తోందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా తరువాత థమన్ క్రేజ్ ఒక్కసారి గా మారిపోయింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్, అలాగే తమన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అంటూ గత కొద్ది రోజులుగా సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి అతిథులుగా వచ్చారు. వీరిద్దరూ ఈ షోలో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఎన్టీఆర్ తో కలిసి ముచ్చట్లు కూడా పెట్టారు.
ఇదిలా ఉంటే తాజాగా తమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్ ఖాతా ద్వారా తమన్ తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు.#ASKTHAMAN అంటూ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. కొద్దిసేపు మాత్రమే అందుబాటులో ఉంటాను,ఎవరైనా,ఏదైనా అడగాలి అనుకున్నా తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నించండి అని తెలిపారు తమన్.
ఈ క్రమంలోనే పలువురు తమన్ చేస్తున్న సినిమాల గురించి,వారి అభిమాన హీరోల గురించి అడిగారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా పాటల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంజాయ్ చేస్తున్నారా అని అడగగా.. ఈ విషయంపై స్పందించిన తమన్ అల్లుఅర్జున్ గురించి మాట్లాడుతూ.. నేను సాధారణంగా అల్లు అర్జున్ గారిని ఇష్టపడతాను.. అని చెప్పుకొచ్చాడు. కానీ దేవిశ్రీ ప్రసాద్ గురించి కానీ, అతని పేరు కానీ ఎక్కడ ఎత్తలేదు.దీంతో వీరిద్దరి మధ్య గత కొద్దిరోజుల నుంచి మనస్పర్ధలు వస్తున్నాయని అందుకోసమే పుష్ప పాటల గురించి మాట్లాడ లేదంటూ నెటిజన్లు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…