Serial Actress Aishwarya: నేను కడుపులో ఉండగానే నాన్న అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. కన్నీటిపర్యంతమైన సీరియల్ నటి ఐశ్వర్య!
Serial Actress Aishwarya: ప్రతిరోజు బుల్లి తెరపై మనల్ని ఎంతో సందడి చేసే ఎంతోమంది నటీనటుల జీవితాలు మనం అనుకున్నంత సంతోషంగా ఏమి కనిపించవు. పైకి నవ్వుతూ కనిపించినా… ఆ నవ్వు వెనుక ఎన్నో బాధలు, కన్నీటి కష్టాలు ఉంటాయి.ఇలా ఎంతో మంది నటీనటుల జీవితాలలో ఇలాంటి కన్నీటి గాథలు ఎన్నో ఉన్నాయి.
తాజాగా స్టార్ మాలో ప్రసారమయ్యే స్టార్ మా పరివార్ కార్యక్రమంలో భాగంగా కస్తూరి సీరియల్ టీమ్ అలాగే కేరాఫ్ అనసూయ సీరియల్ టీమ్ పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో భాగంగా కేరాఫ్ అనసూయ ఫేమ్ శివాని చిన్నప్పటి నుంచి తన తండ్రి ప్రేమను నోచుకోలేక పోయాయని నా తండ్రి మరణించిన వార్త తెలుసుకొని రాత్రంతా జర్నీ చేసి ఉదయం అక్కడికి చేరుకునేలోపు అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని కన్నీళ్లు పెట్టుకుంది.
అదేవిధంగా కస్తూరి ఫేమ్ ఐశ్వర్య కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక తన విషయం గురించి మాట్లాడుతూ నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న మా అమ్మని మోసం చేసి తనని వదిలి వెళ్ళాడని ఈ సందర్భంగా కస్తూరి తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
చిన్నప్పటి నుంచి అమ్మ ఒంటరిగా నన్ను పిలిచి ఈ స్థాయికి తీసుకు వచ్చిందని తెలిపారు. ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఒక ఆడదాని జీవితం ఎందుకు నాశనం చేయాలి?మీకు ఇష్టం లేకపోతే దయచేసి పెళ్లి చేసుకుని మోసం చేయకండి అంటూ ఈ సందర్భంగా ఐశ్వర్య చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా వీరిద్దరి కన్నీటి గాథను విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…