రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గత రెండేళ్లుగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చినా కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ పిరియాడిక్ మల్టీస్టారర్ ఎట్టకేలకు మార్చి 25 న విడుదలకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో.. రేపు సాయంత్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా ప్రస్థానం మొదలవబోతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారు జక్కన్న. మూడు సంవత్సరాలపాటూ చెక్కి చెక్కి అద్భుతమైన విజువల్ వండర్ గా తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ వాడిన బైక్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఒకప్పటి మోడల్ లో ఉన్న ఈ బైక్ ప్రత్యేకత ఏమిటి ? మోడల్ ఏమిటి ? వంటి అనేక రకాల చర్చ అభిమానుల్లో మొదలైంది. ఇక ఈ బైక్ ప్రత్యేకత విషయానికి వస్తే.. డైరెక్టర్ రాజమౌళీ ఈ బైక్ కోసం చాలా అన్వేషణ చేసాడట.
1920 కాలానికి చెందిన బైక్ అప్పట్లో ఎలా ఉండేవి అనేదానిపై అనేక రకాల రీసెర్చ్ చేసిన జక్కన్న మొత్తానికి ఒక బ్రిటన్ కి చెందిన కంపెనీ దగ్గర వుందని తెలుసుకుని.. బర్మింగ్ హోమ్ లో ఉన్న ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ కి వెళ్లి తీసుకువచ్చారట. ఈ బైక్ పేరు వెలాసిటీ మోటార్ బైక్.. ఇక ఈ బైక్ ప్రత్యేకత విషయానికి వస్తే.. 1920 నుంచి 1950 మధ్య కాలంలో వెలాసిటీ మోటార్ బైక్ కంపెనీ రేసింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగిందట. అప్పట్లోనే 350 సీసీ, 500సీసీ బైక్ లను ఈ కంపెనీ లాంచ్ చేసిందట. అయితే కొద్దిరోజుల తర్వాత 1971లో ఈ కంపెనీ బైక్ తయారీ పూర్తిగా నిలిపివేసిందట.
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…
తెలుగు బుల్లితెరలో తన ప్రత్యేక శైలితో గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ Anchor Ravi తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.…
భారతీయ ఇతిహాసాల్లో నైతిక విలువలు, జీవన సూత్రాలు చెప్పడంలో మహాభారతంకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో కీలక పాత్రధారి అయిన…
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు…
ఆరోగ్య పరిస్థితులను ముందుగానే గుర్తించడంలో మన శరీరం ఇచ్చే చిన్న సంకేతాలు చాలా కీలకం. అందులో ముఖ్యంగా చెమట కూడా…