Samantha: హెయిర్ స్టైలిస్ట్ గా మారిన సమంత… చేసిన పనికి డబ్బులు ఇవ్వలేదంటూ ప్రీతమ్ పై కామెంట్స్!
Samantha: స్టార్ హీరోయిన్ గా సమంత అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం సమంత వరస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం యశోద సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈమె ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్నారు. ఇక సమంతతో పాటు తన టీమ్ కూడా తనతో పాటే ఉన్నారు.
ఇలా సమంత టీమ్ లో తన డిజైనర్ ప్రీతమ్ కూడా తనతో పాటే ఉన్నారు. సమంత డిజైనర్ ప్రీతమ్ గురించి అందరికీ తెలిసిందే. సమంత విడాకులు సమయంలో ఇతని గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ప్రీతమ్ కారణంగానే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చారని పెద్దఎత్తున రూమర్లు వచ్చాయి. అయితే సమంతను ప్రీతమ్ అక్క అని పిలుస్తాడని,వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నాగచైతన్య కూడా తెలుసు అంటూ సమంత స్నేహితులు వెల్లడించారు.
ఇకపోతే సమంత ఆ విషయాలన్నింటి గురించి మర్చి పోయి ప్రస్తుతం తన సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక షూటింగ్ విరామ సమయంలో సమంత తన టీమ్ తో కలిసి ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు. షూటింగ్ విరామ సమయంలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ఉన్నఫలంగా హెయిర్ స్టైలిస్ట్ గా మారిపోయింది.
ఈ క్రమంలోనే తన డిజైనర్ ప్రీతమ్ కి హెయిర్ కట్ చేస్తూ ఉన్న ఫోటోని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నేను మల్టీ టాలెంటెడ్ అని పోస్ట్ చేయడమే కాకుండా తాను హెయిర్ కట్ చేసినందుకు ప్రీతమ్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది. దీనికి ప్రీతమ్ కూడా చంపెయ్ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరు షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…