విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నిన్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను ఊసరవెళ్లితో పోల్చి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్ విమర్శల గురించి పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా ఆయన సోదరుడు నాగబాబు మాత్రం ఘాటుగా స్పందించారు. ప్రకాశ్ రాజ్ నిర్మాతలను డబ్బు కోసం హింసించాడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్ చరిత్ర తనకు తెలుసంటూ విమర్శలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రముఖ సినీ నటుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీకి పవన్ మద్దతు ఇవ్వడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుబట్టడంతో మాటల యుద్ధం మొదలైంది. నిన్న ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడంతో ఈరోజు ట్విట్టర్ ద్వారా నాగబాబు ప్రకాశ్ రాజ్ పై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు, పార్టీలకు ఉపయోగపడటం కోసం రాజకీయాల్లో నిర్ణయాలు మారుతూ ఉంటాయని తెలిపారు.
విస్తృత ప్రయోజనాల కోసమే పవన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికాడని నాగబాబు అన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లో ప్రకాశ్ రాజ్ డొల్లతనం తనకు అర్థమైందని కామెంట్లు చేశారు. బీజేపీ నిర్ణయాలను విమర్శించడంలో తప్పు లేదని నాగబాబు అన్నారు. మంచి చేసినా మెచ్చుకోలేని కుసంస్కారం ప్రకాశ్ రాజ్ ది అంటూ నాగబాబు మండిపడ్డారు.
ఏపీకి జనసేన పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని తాను ఖచ్చితంగా చెప్పగలనని.. ప్రకాశ్ రాజ్ నిర్మాతలను డబ్బు కోసం ఎన్నిరకాలుగా హింసించాడో తనకు తెలుసని నాగబాబు అన్నారు. ప్రకాశ్ రాజ్ మంచి మనిషిగా మారాలని ఆ తరువాత కామెంట్లు చేయాలని నాగబాబు చెప్పారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ వల్లే ఎన్ని విమర్శలు చేసినా ప్రకాశ్ రాజ్ ని ఆ పార్టీ నేతలు ఒక్క మాట కూడా అనలేదని చెప్పారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…