విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నిన్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను ఊసరవెళ్లితో పోల్చి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్ విమర్శల గురించి పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా ఆయన సోదరుడు నాగబాబు మాత్రం ఘాటుగా స్పందించారు. ప్రకాశ్ రాజ్ నిర్మాతలను డబ్బు కోసం హింసించాడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్ చరిత్ర తనకు తెలుసంటూ విమర్శలు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రముఖ సినీ నటుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీకి పవన్ మద్దతు ఇవ్వడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుబట్టడంతో మాటల యుద్ధం మొదలైంది. నిన్న ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడంతో ఈరోజు ట్విట్టర్ ద్వారా నాగబాబు ప్రకాశ్ రాజ్ పై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు, పార్టీలకు ఉపయోగపడటం కోసం రాజకీయాల్లో నిర్ణయాలు మారుతూ ఉంటాయని తెలిపారు.

విస్తృత ప్రయోజనాల కోసమే పవన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికాడని నాగబాబు అన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లో ప్రకాశ్ రాజ్ డొల్లతనం తనకు అర్థమైందని కామెంట్లు చేశారు. బీజేపీ నిర్ణయాలను విమర్శించడంలో తప్పు లేదని నాగబాబు అన్నారు. మంచి చేసినా మెచ్చుకోలేని కుసంస్కారం ప్రకాశ్ రాజ్ ది అంటూ నాగబాబు మండిపడ్డారు.

ఏపీకి జనసేన పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని తాను ఖచ్చితంగా చెప్పగలనని.. ప్రకాశ్ రాజ్ నిర్మాతలను డబ్బు కోసం ఎన్నిరకాలుగా హింసించాడో తనకు తెలుసని నాగబాబు అన్నారు. ప్రకాశ్ రాజ్ మంచి మనిషిగా మారాలని ఆ తరువాత కామెంట్లు చేయాలని నాగబాబు చెప్పారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ వల్లే ఎన్ని విమర్శలు చేసినా ప్రకాశ్ రాజ్ ని ఆ పార్టీ నేతలు ఒక్క మాట కూడా అనలేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here