Naga Chaitanya: సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ‘ బంగార్రాజు’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాగార్జున, నాగచైతన్య మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. 2016 లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది.
ఆరేళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన ఈసినిమా.. చాలా పెద్ద హిట్ గా నిలిచింది. మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో బంగార్రాజుపై కూడా అంచనాలు పెరిగాయి. మరో వైపు నాగచైతన్య, నాగార్జున కలిసి నటిస్తుండటంతో.. ఫ్యాన్స్ కు పండగే.
ఇదిలా ఉంటే ప్రయోషన్లలో బిజీగా ఉంది బంగార్రాజు టీం. ఇప్పటికే అనూప్ రూబెన్స్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులు సమయమే ఉండటంతో త్వరత్వరగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం గత రాత్రి(సోమవారం) మ్యూజికల్ నైట్స్ అనే ఈవెంట్‌ని నిర్వహించింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతుండగా.. ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మ్యూజిక్ గురించి అనూప్ రూబెన్స్ ను ప్రశంసిస్తుంటే.. సడెన్ గా నాగ చైతన్య వెనక్కి తిరిగి హీరోయిన్ దక్షనాగర్కర్ వైపు చూశాడు. దీంతో ఆ అమ్మడు కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా నవ్వింది. దీంతో చైతూ సిగ్గుపడిపోయాడు. ఈ సీన్ మొత్తం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ గా మారింది. ‘మెన్ విల్ బి మెన్ ’ అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక్కోసారి సెడెన్ ఇన్సిడెంట్లు కూడా క్యూట్ గా ఉంటాయని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టిలతో పాటు ఫరియా అబ్దుల్లా, మీనాక్షి దీక్షిత్,దర్శిని, వేదిక, దక్ష నగార్కర్, సిమ్రత్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…