Nagarjuna: బంగార్రాజులో ఎనిమిది మంది హీరోయిన్లు..ఆ లిస్ట్ లో ఉన్నది ఎవరంటే..!
Nagarjuna: అక్కినేని నాగార్జున, నాగచైతన్య క్రేజీ కాంబినేషన్ లో ఉన్న ‘బంగార్రాజు’ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి’, ‘జీ స్టూడియోస్’ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
హీరోయిన్ కృతి శెట్టి అందం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే అనూప్ రూబెన్స్ అందిచిన మ్యూజిక్ ఇప్పటికే హిట్ అయింది. ఇదిలా ఉంటే గతంలో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా వస్తోంది. ఆరేళ్ల క్రితం సంక్రాంతి బరిలో దిగిన ఆసినిమా భారీ విజయం సాధించింది.
2016లో విడుదలైన ఈసినిమా నాగ్ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచింది. అయితే ఆ రేంజ్ హిట్ నాగార్జునకు పడలేదు. పలు సినిమాలు చేసినా.. బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దీంతో ఈసినిమా నాగార్జునకు చాలా ఇంపార్టెంట్ గా మారింది.
అయితే సినిమా విడుదలకు డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సినిమా యూనిట్. అయితే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. బంగార్రాజు సినిమాలో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు.. 8 మంది హీరోయిన్లు నటించారనే విషయాన్ని వెల్లడించారు. వాళ్లెవరని ప్రశ్నిస్తే…రమ్య కృష్ణ, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా, మీనాక్షి దీక్షిత్,దర్శిని, వేదిక,దక్ష నగార్కర్,సిమ్రత్ కౌర్ అంటూ జవాబిచ్చాడు. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనగకలుగా కొంతమంది సందర్భానుసారం కనిపిస్తారని వెల్లడించారు. ఇంత మంది హీరోయిన్లు నటిస్తుండటంతో… సినిమా ఓ పండగలా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…