Naga Chaitanya: ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కస్టడీ” సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత తో కలిసి నాగచైతన్య సందడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ అండ్ ఛానల్స్ రన్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా నాగచైతన్య ఆర్గనైజ్ చేస్తున్న “షోయూ” లో ఆశ్రిత సందడి చేసింది. “ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ ఎట్ షో యూ విత్ మై బావ” అనే క్యాప్షన్ తో వీడియోని యూట్యూబ్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆశ్రిత నాగచైతన్యని బావ బావ అంటూ సందడి చేసింది.
హైదరాబాద్ లో నాగచైతన్య రన్ చేస్తున్న రెస్టారెంట్ లో ఆశ్రిత ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసి తన బావ నాగచైతన్యకు తినిపించింది. ఈ వీడియోలో బావ మరదలు ఇద్దరూ కలిసి చేసిన సందడి నేటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
.
ఇదిలా ఉండగా సమంత నుండి విడిపోయిన తర్వాత నాగచైతన్య తన కెరీర్ మీద దృష్టి పెట్టి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ దూత ‘ అనే వెబ్ సిరీస్ లో కూడా నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇలా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా తన బిజినెస్ లను కూడా చూసుకుంటున్నాడు. ఇక చాలా కాలంగా నాగచైతన్య రెండవ వివాహం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగచైతన్య మాత్రం గురించి ఎక్కడ స్పందించటం లేదు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…