Movie News

Varalakshmi Sarathkumar: ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్… నటి ఎమోషనల్ పోస్ట్!

Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు పూర్తి కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన పదేళ్ల సినీ కెరియర్ లో ఎదుర్కొన్న సంఘటనలను తెలియజేశారు.

ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిందని అయితే ఈ పది సంవత్సరాలలో తాను ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నానని వెల్లడించారు. కెరియర్ మొదట్లో చాలామంది తనని బాడీ షేమింగ్ చేశారని నటనకు తాను సరిపోనంటూ ఎంతో అవమానించారని వెల్లడించారు.

బొద్దుగా ఉన్నావు ఫేసులో ఆకర్షణ లేదు అంటూ ఎంతోమంది తనకి అవకాశాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేశారంటూ ఈమె ఆవేదన చెందారు. అయితే వాటి నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.ఇలా అవమానాలు తిరస్కారాలు నన్ను ఆపలేదని పదేళ్ల కెరియర్ లోనే 45 సినిమాలలో నటించానని ఈమె తెలిపారు.

Varalakshmi Sarathkumar: పదేళ్ల కెరియర్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను…

హీరోయిన్ గా మాత్రమే కాకుండా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలోను నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్నానని అయితే తనకు ఎక్కువగా విలన్ పాత్రలు మంచి పేరు తీసుకువచ్చాయని వరలక్ష్మి శరత్ కుమార్ వెల్లడించారు. ఈ పది సంవత్సరాల నా సినీ కెరియర్ లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి అనుభూతికి లోనవుతున్నానని ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఈమె తెలుగులో క్రాక్ సినిమాతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అనంతరం నాంది యశోద వంటి సినిమాలలో కూడా నటించి సందడి చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago