Naga Chaitanya: వామ్మో.. ఏంటి చైతూ నాగార్జున సీక్రెట్స్ అన్ని బయట పెట్టేశావు…!
Naga Chaitanya: అక్కినేని హీరోలు నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది. మనం సినిమా తరువాత నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు.
ఇలా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ నాగార్జున గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే నాగార్జునకు కోపం రావాలంటే ఏం చేయాలి అని నాగచైతన్యను ప్రశ్నించగా నాగచైతన్య ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నాన్నకు కోపం తెప్పించాలి అంటే ముందుగా నాన్న అనుకున్న ప్లాన్ అలాగే జరగాలి ఎవరైనా చివరి క్షణంలో ఆ ప్లాన్ మారిస్తే తొందరగా కొప్పడతారు అంటూ సమాధానం చెప్పారు.
మరి ఆ కోపం పోవాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ… నాన్న కోపం పోవాలి అంటే ఆయనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ పెడితే చాలు ఆయన కోపం తొందరగా పోతుంది అని నాగచైతన్య తెలిపారు.
నాన్నకు ఇండియన్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టమని ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే నాన్న చాలా ఇష్టంగా తింటారని నాగచైతన్య తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక మహిళ చేసే బిర్యానీ నాన్న చాలా ఇష్టపడతారు. ఆవిడ పేరు నాకు తెలియదు కానీ ఎప్పుడు బిర్యానీ తినాలన్నా అక్కడి నుంచే తెప్పించుకొని తింటారు అంటూ నాగచైతన్య నాగార్జున కు సంబంధించిన సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు.ఈ విధంగా నాగచైతన్య ఆ మహిళ గురించి ప్రస్తావించగా నెటిజన్లు ఆ మహిళ ఎవరు? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…