Sai Pallavi: మహేష్ సోదరిగా సందడి చేయనున్న ఫిదా బ్యూటీ.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అభిమానులు!
Sai Pallavi: సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఏ విధమైనటువంటి గ్లామరస్ పాత్రలో నటించకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గత ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో 11 సంవత్సరాల తర్వాత వస్తున్న చిత్రం గురించి ప్రతి ఒక్కరికి ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని కీలక మలుపు తిప్పే పాత్ర ఉందని ఆ పాత్ర మహేష్ బాబు చెల్లెలు పాత్ర అని, ఆ పాత్రలో నటించడానికి చిత్రబృందం సాయిపల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు సాయి పల్లవి అన్నా,చెల్లెలుగా నటిస్తున్నారంటే చాలామంది ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నప్పటికీ మరి కొంతమంది అభిమానులు మాత్రం పొరపాటున కూడా ఇలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకోకూడదని, ఇలాంటి పాత్రలో నటిస్తే తొందరగా కెరియర్ దెబ్బతింటుందని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి చెల్లెలి పాత్రలో నటించడానికి సాయి పల్లవి ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…