Naga Chaitanya: టాలీవుడ్ క్రేజీ కపుల్ నాగచైతన్య సమంత విడిపోవడాన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వీరి విడాకుల ప్రకటన వచ్చి పది నెలలు పూర్తి అవుతున్నప్పటికీ నాగచైతన్య ఇప్పటివరకు ఎక్కడ తన విడాకుల గురించి స్పందించలేదు.
ఇకపోతే తాజాగా ఈయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అయ్యారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈయన విడాకుల గురించి నోరు విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్యకు యాంకర్ నుంచి ఒక ప్రశ్న ఎదురయింది.
సమంత గురించి విడాకుల విషయం కాకుండా కొత్తగా తనపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని ప్రశ్నించారు. దీనికి నాగచైతన్య సమాధానం చెబుతూ.. సమంత అంటే ఇప్పటికీ నాకు ఎంతో గౌరవం. తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు మేమిద్దరం పరస్పర అభిప్రాయాలతోనే విడాకులు ప్రకటించామని సమాధానం చెప్పారు. మా మధ్య ఏం జరిగిందో మేము అదే చెప్పాం అంతకుమించి మా ఇద్దరి మధ్య మా విడాకుల గురించి ఏం లేదని కానీ కొందరు ఏవేవో కల్పించారని ఈయన తెలిపారు.
ఈ విధంగా మేమిద్దరం ఒక అండర్ స్టాండింగ్ తో విడాకుల ప్రకటన చేసినప్పటికీ మా గురించి ఏవేవో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆ వార్తలు చూసి చాలా విసుగు వచ్చిందని ఈ సందర్భంగా నాగచైతన్య వెల్లడించారు.అయితే ప్రస్తుతం అంతా సెట్ అయిందని మేము మా వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి కేవలం వృత్తిపరమైన విషయంపై దృష్టి పెట్టి పలు సినిమాలతో బిజీగా ఉన్నామని ఈ సందర్భంగా చైతన్య తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…